AP Elections 2024: చివరి రోజు ఏపీకి అగ్రనేతలు.. కడపకు రాహుల్.. తిరుపతికి నడ్డా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: ఎన్నికల షెడ్యూల్ వచ్చాక తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు రాహుల్ గాంధీ. ఇవాళ కడపలో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ ఉదయం పదకొండున్నరకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్… అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 11 గంటల 45 నిముషాలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులర్పిస్తారు. ఆ తరువాత ఒంటి గంట సమయంలో కడపలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు రాహుల్.
Read Also: CM YS Jagan: పిఠాపురంలో ప్రచారాన్ని ముగించనున్న సీఎం జగన్.. నేటి షెడ్యూల్ ఇదే..
Also Read
మరోవైపు.. ఎన్నికల ప్రచారం కోసం నేడు ఏపీకి రానున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తిరుపతిలో జరిగే రోడ్‌షోలో జేపీ నడ్డా పాల్గొంటారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు తిరపుతిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి నాలుగు కాళ్ల మండపం వరకు జేపీ నడ్డా రోడ్‌షో కొనసాగనుంది. జనసేన నేత నాగబాబుతో పాటు టీడీపీ, జనసేన ముఖ్యనేతలు హాజరుకానున్నారు. ఇక, నేడు చిత్తూరులో చంద్రబాబు పర్యటన ఉంది.. ఎన్నికల ముగింపు ప్రచారాన్ని చిత్తూరు సభతో ముగించనున్న చంద్రబాబు… చిత్తూరు సభ అనంతరం నేరుగా తిరుమల వెళ్లనున్నారు.. రాత్రికి స్వామివారిని దర్శించుకోనున్న చంద్రబాబు. మరోవైపు నేడు కాకినాడలో రోడ్ షో, ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు..
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!