క్రికెట్ లో రాహుల్ ద్రవిడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పటి మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్. ఈయన క్రికెట్ ఆడే సమయంలో టీమిండియా వాల్ అని పిలిచేవారు. ఇకపోతే.. ద్రవిడ్ తన కోచింగ్ లో టీమిండియాను పటిష్టంగా చేశాడు. మొత్తానికి అటు క్రికెట్ లోనూ, ఇటు కోచింగ్ లోనూ బాగా రాణిస్తున్నాడు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ కొడుకు కూడా ఓ క్రికెటర్ అన్న విషయం అందరికీ తెలియదు. అంతేకాకుండా.. అతను ఆడే కట్ షాట్స్ సేమ్ టూ సేమ్ రాహుల్ ద్రవిడ్ ఆడినట్లే ఉంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతను ఆడే షాట్లను చూస్తే ద్రవిడ్ ఆడినట్లే ఉంది.
ద్రవిడ్ కట్ షాట్లకు ప్రసిద్ధి
రాహుల్ ద్రవిడ్ కట్ షాట్లకు ప్రసిద్ధి అని అందరికీ తెలిసిందే. ద్రవిడ్ కొడుకు సమిత్ పటేల్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) తరపున ఆడుతున్నాడు. లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ (LCCC), KSCA జట్టు మధ్య మ్యాచ్ జరుగుతున్న క్రమంలో.. సమిత్ పటేల్ 45 బంతుల్లో 25 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు ఉన్నాయి. అందులో అతను ఆడిన విధానం.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రాహుల్ ద్రవిడ్ తన కుమారుడికి కోచింగ్ ఇవ్వడు
రాహుల్ ద్రవిడ్ తన కొడుకు సమిత్‌కి కోచింగ్ ఇవ్వడు. ఈ విషయాన్ని ద్రవిడ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘నా కొడుకు సమిత్‌కి నేను కోచింగ్ ఇవ్వను. నా అభిప్రాయం ప్రకారం, తల్లిదండ్రులు మరియు కోచ్ పాత్రలను ఒకేసారి పోషించడం చాలా కష్టం. కానీ.. నేను అతని తండ్రి అయినందుకు సంతోషంగా ఉన్నాను, కానీ తండ్రిగా నేను ఏమి చేస్తున్నానో నాకు తెలియదు’. అని ద్రవిడ్ తెలిపారు
సమిత్ ఆల్ రౌండర్
భారత క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ ద్రవిడ్ తనదైన ముద్ర వేశారు. అయితే అతని కొడుకు సమిత్ ఆల్ రౌండర్. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ కూడా. సమిత్ మాత్రమే కాదు.. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా భారత క్రికెట్‌లో అడుగుపెట్టి తనదైన ముద్ర వేస్తున్నాడు. గతేడాది అర్జున్ టెండూల్కర్ ముంబై తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఈ సీజన్‌లో కూడా అర్జున్ ముంబై తరపున ఆడుతున్నాడు.
Trademark Dravid cut!
Courtesy: Samit Dravid
.
.#FanCode pic.twitter.com/HC97Hpou44— FanCode (@FanCode) March 19, 2024