జోనల్ టోర్నమెంట్‌లో కర్నాటక అండర్-14 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు భారత దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ సిద్ధమవుతున్నాడు. అన్వయ్ కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. అన్వయ్ ఇప్పటికే గొప్ప బ్యాటర్‌గా పేరుతెచ్చుకున్నాడు. అతను కర్ణాటక తరపున జూనియర్ క్రికెట్ ఆడుతున్నాడు. అయితే తాజాగా అన్వయ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Also Read : Microsoft Layoff: రెండు దశాబ్ధాల అనుబంధం.. భారతీయ ఉద్యోగి తొలగింపు.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అతని తండ్రిలాగే అన్వయ్ కూడా వికెట్ కీపర్. రాహుల్ ద్రవిడ్ కొంత కాలం పాటు వన్డేలు మరియు టెస్టుల్లో భారత్‌కు పూర్తి సమయం వికెట్ కీపర్‌గా ఉన్నాడు. భారత్‌కు కీపర్ కావాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ద్రవిడ్ ఆ బాధ్యత వహించాడు. ఎంఎస్ ధోని జట్టులోకి రావడంతో ద్రవిడ్ బ్యాటర్‌గా మాత్రమే ఆడాడు. క్రికెట్ ఆటలో పేరు తెచ్చుకోవాలని చూస్తున్న ద్రవిడ్ కొడుకు అన్వయ్ ఒక్కడే కాదు అతని అన్నయ్య సమిత్ కూడా క్రికెటర్. ఇటీవల, సమిత్ 2019/20 సీజన్‌లో అండర్-14 స్థాయిలో రెండు డబుల్ సెంచరీలు సాధించాడు.
Also Read : UK: బ్రిటన్ పార్లమెంట్‌లో మోదీ డాక్యుమెంటరీపై రచ్చ.. గుజరాత్ అల్లర్లపై బీబీసీ సిరీస్..