Congress: రాయ్‌బరేలీ అభ్యర్థి ఖరారు.. ఏ క్షణంలోనైనా ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. కానీ కాంగ్రెస్ మాత్రం రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. ఈ రెండు స్థానాలు కాంగ్రెస్‌కు కంచుకోట లాంటివి.. అలాంటిది ఇప్పటి వరకూ ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే శనివారం జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో.. ఆ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసే బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అప్పగించింది. ఇదిలా ఉంటే రాయ్‌బరేలీ ఎన్నికల నిర్వహణ కోసం 24 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది.
ఇది కూడా చదవండి: Delhi : ఢిల్లీలో 20 రోజుల పాటు మూతపడనున్న ఫ్లై ఓవర్.. కారణం ఇదే !
Also Read
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
ఇదిలా ఉంటే ఈసారి సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ప్రియాంకనే రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏ క్షణంలోనైనా ప్రియాంక పేరు ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.. రాయ్‌బరేలీ అభ్యర్థిని స్వయంగా ప్రకటిస్తారని సమాచారం. అలాగే అమేథీ సీటును కూడా ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అమేథీ నుంచి రాహులే పోటీ చేస్తారా? లేదంటే ఇంకెవరైనా? పోటీ చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Delhi High Court: ఆరేళ్ల పాటు ప్రధాని మోడీ పోటీ చేయకుండా నిషేధించాలి..
సోనియా ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరోగ్యరీత్యా ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో మాత్రం సోనియా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల పేర్లను ఇటీవలే కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో సోనియా గాంధీ పేరు ఉంది.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. తర్వాత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mahesh : ప్రేమంటే ఇదేరా.. మహేష్ తో మంజుల క్యాండిడ్ వీడియో వైరల్
తాజావార్తలు
-
Team India Mission 300: టీమిండియా ‘మిషన్ 300’.. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడే!
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..