మిలిటెంట్ ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలు దిగి వస్తాయని…ఆ దిశగా బీసీ డిమాండ్లపై పోరాటానికి సిద్ధం కావాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కోరారు. బీసీల పలు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వచ్చే నెల 5, 6 తేదీల్లో చలో దిల్లీకి పిలుపునిచ్చినట్లు… దీనికి బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీ సమస్యలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సభలో ఆర్. కృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావుతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
V Srinivasa Rao: మోడీతో కలిసి నడవడానికి పోటా..? ఏపీకి అన్యాయం చేసినా బాబు, జగన్, పవన్ మాట్లాడరా..?
బీసీలు ఓటు విలువ తెలుసుకోవాలని…ఓటంటే తెల్లకాగితం , కంప్యూటర్ బటన్ కాదని ఓటంటే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులని ఆర్ కృష్ణయ్య అన్నారు. కులాలకు, మతాలకు ఓట్లు వేసే రోజులు పోవాలని…మన భవిష్యత్తు , మన పిల్లల భవిష్యత్తు వేసే ఓటుపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తనకు గతంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినా…తమ పార్టీలోని అగ్రనాయకులు అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఏన్నాళ్లు అగ్రకులాలు ముఖ్యమంత్రులు అవుతారని… భవిష్యత్తు లోనైన బీసీలు ముఖ్యమంత్రిని చేసేందుకు నేటి తరం యువత ముందుకు రావాలని కోరారు.