India reach Archery Compound Women’s Team Final: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2023 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కథ ముగిసింది. కనీసం కాంస్య పతకం అయినా తెస్తుందని ఆశించిన భారత్‌కు నిరాశే మిగిలింది. గురువారం ఉదయం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్‌లో సింధు 16-21, 12-21 తేడాతో హే బింగ్‌జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది. తెలుగు తేజం కనీస పోటీ ఇవ్వకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ప్రపంచ నం.5 హే బింగ్‌జియావో దాటికి పీవీ సింధు చిత్తుగా ఓడింది. రెండు గేముల్లో బింగ్‌జియావోకు సింధు పోటీనే ఇవ్వలేదు. ఇది ఏకపక్ష పోటీగా మారింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21–16, 21–16తో పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేసియా)పై అద్భుత విజయం సాధించిన సింధు.. కీలక మ్యాచులో చేతులెత్తేసింది.
Also Read: India Playing 11: సూర్య, సిరాజ్‌కు దక్కని చోటు.. ప్రపంచకప్‌కు భారత్ తుది జట్టు ఇదే!
మరోవైపు కాంపౌండ్ ఆర్చరీ మహిళల టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌కు చెందిన జ్యోతి వెన్నమ్, అదితి స్వామి, పర్నీత్ కౌర్‌లు 233-219 స్కోరుతో ఇండోనేషియాకు చెందిన రాతిహ్ ఫడ్లీ, స్యాహరా ఖోరునిసా, శ్రీ రంతీలను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ విజయంతో కాంపౌండ్ ఆర్చరీ మహిళల టీమ్‌కు కనీసం రజత పతకం ఖాయం అయింది. ఇక పురుషుల 62 కేజీల రౌండ్ ఆఫ్ 32లో వియత్నాం ఆటగాడు వాన్ థాంగ్ క్యాన్‌తో భారత్‌కు చెందిన తరుణ్ యాదవ్ 0-7 తేడాతో ఓడిపోయాడు.