India Playing 11: సూర్య, సిరాజ్‌కు దక్కని చోటు.. ప్రపంచకప్‌కు భారత్ తుది జట్టు ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Bard AI’s India Playing 11 for ICC World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 సందడి మరికొన్ని గంటల్లో షురూ అవ్వనుంది. గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి పోరుతో ప్రపంచకప్ ఆరంభం అవుతుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. అక్టోబర్ 8న భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి అంతా భారత్ తుది జట్టుపైనే ఉంది. తుది జట్టులో ఆడే అవకాశం ఎవరికి దక్కుతుంది, ఎవరు బెంచ్‌కు పరిమితమవుతారనే దానిపై క్రికెట్ అభిమానులు సహా మాజీలు చర్చించుకుంటున్నారు.
ప్రపంచకప్ 2023 నేపథ్యంలో భారత్ ఫేవరెట్ ప్లేయింగ్ ఎలెవన్ ఏంటి? అని గూగుల్ బార్డ్‌ను అడిగితే… ఆసక్తికర సమాధానం ఇచ్చింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంచుకున్న గూగుల్ బార్డ్.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లను బ్యాటర్లుగా ఎంచుకుంది. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలకు ఆల్‌రౌండర్ కోటాలో ఎంచుకోగా.. రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లను స్పిన్ కోటాలో తీసుకుంది. అయితే జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలను పేస్ కోటాలో ఎంచుకున్న గూగుల్ బార్డ్.. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్లను బెంచ్‌కు పరిమితం చేసింది.
Also Read
Also Read: ICC Cricket World Cup 2023: నేటి నుంచే వన్డే ప్రపంచకప్.. తొలి పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ!
తాను ఎంపిక చేసిన జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో సమతూకంగా ఉందని గూగుల్ బార్డ్ పేర్కొంది. అంతేకాదు తుది జట్టులో ఆటగాళ్లను ఎంచుకోవడానికి గల కారణాలను కూడా తెలిపింది. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్లతో కూడిన తన జట్టుకు ప్రపంచకప్ 2023 టైటిల్ గెలవగల సత్తా ఉందని తెలిపింది.
గూగుల్ బార్డ్ ప్లేయింగ్ ఎలెవన్:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?