Pushpa 2 : మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన సినిమా పుష్ప 2 . డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 1కు సీక్వెల్ గా తెరకెక్కింది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం సుకుమార్, బన్నీ తమ మూడేళ్ల సమయాన్ని వెచ్చించారు. ప్రతి క్షణం సినిమాకోసం ఎంతగానో కష్టపడ్డారు.
Read Also:Yadadri: పాఠశాల నుండి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కొడుకుని కొట్టి చంపిన తండ్రి..
ఈ సినిమా తెలుగు రాష్ట్రాలను మించి హిందీలో భారీ కలెక్షన్లను రాబట్టుతోంది. బాలీవుడ్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ తో ట్రెండ్ సెట్ చేస్తోంది పుష్ప 2. విడుదలైన మొదటి రోజు పుష్ప – 2 ఏకంగా రూ. 72 కోట్లు కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా హిందీ స్టార్ హీరోలకు మరో సారి రుచి చూపింది. ఇప్పటి వరకు రూ.2000కోట్ల వరకు కొల్లగొట్టి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. తన మాస్ పెర్ఫామెన్స్ తో అల్లు అర్జున్ అదరగొడుతున్నాడు.
Read Also:Jana Sena: జనసేన తిరుపతి ఇంఛార్జిపై మహిళ ఆరోపణలు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం..
ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో కూడా వచ్చింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ చిత్రం ఆల్రెడీ వెస్ట్రన్ ఆడియెన్స్ లో సాలిడ్ రీచ్ ని అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇపుడు వారిని మరింత అలరించేందుకు లేటెస్ట్ గా పుష్ప 2 సినిమా ఇంగ్లీష్ భాషలో కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. దీనితో ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రీట్ ఇవ్వనుంది అని చెప్పాలి. ఇక అక్కడ నుంచి ఎలాంటి రీచ్ ని ఈ చిత్రం అందుకుంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.