Puri Jagannadh :టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతున్నాడు.తాజాగా ఈ యంగ్ హీరో నటించిన “హనుమాన్” సినిమా పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.ఈ సినిమాలో తేజ సజ్జా తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో రిలీజ్ అయి భారీగా కలెక్షన్స్ రాబట్టింది.ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా “జై హనుమాన్” సినిమాను తెరకెక్కించనున్నాడు.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
ఇదిలా ఉంటే తేజ సజ్జా “జై హనుమాన్”సినిమాతో పాటు ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో “మిరయ్” సినిమా చేస్తున్నాడు..రీసెంట్ గా ఈ సినిమా నుంచి గ్లింప్సె వీడియో ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ఈ సినిమాలో మంచు మనోజ్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తేజ సజ్జాకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ తేజ సజ్జాతో సినిమా చేసేందుకు సిద్ధం అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది..ప్రస్తుతం పూరి రామ్ తో డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు.ఆ సినిమా పూర్తిగానే తేజతో సినిమా చేసేందుకు సిద్ధం అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.