సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో ఆమెకు ఉపశమనం లభించింది. 5 నెలల జైలు శిక్షను న్యాయస్థానం సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది.
పూణె కారు ప్రమాదంలో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 19న మద్యం మత్తులో పూణెలో వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి బాలుడు కారణమయ్యాడు.