పూణె కారు ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న కుర్రాళ్లు.. వేగంగా దూసుకెళ్లి ఇద్దరు టెకీల మరణానికి కారణం అయ్యారు. అయితే నిందితులకు గంటల వ్యవధిలోనే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
పూణె కారు ప్రమాదంలో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 19న మద్యం మత్తులో పూణెలో వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి బాలుడు కారణమయ్యాడు.
మహారాష్ట్రలోని పూణెలో గత ఆదివారం ఓ బాలుడు కారుతో ఢీకొట్టి ఇద్దరి యువకుల ప్రాణాలు తీశాడు. అనంతరం నిందితుడికి వెంటనే బెయిల్ రావడం.. తర్వాత దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తం కావడంతో అనంరతం బెయిల్ రద్దైంది.