Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poonam Raut: భారత మహిళా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. జింబాబ్వేతో జరగాల్సిన సిరీస్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు, జట్టు సీనియర్ బ్యాటర్ పూనమ్ రౌత్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఆమె ప్రకటించడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. భారత్-జింబాబ్వే మధ్య అక్టోబర్ 16 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న వేళ, ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇక, 37 ఏళ్ల పూనమ్ రౌత్ తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది. 2009 నుంచి 2021 వరకు సాగిన ఆమె ప్రయాణంలో 4 టెస్టులు, 73 వన్డేలు, 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. తన అద్భుతమైన టెక్నిక్, ఓపికతో భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలిచింది. టెస్టుల్లో ఆమె రికార్డులు కావచ్చు, వన్డేల్లో చేసిన సెంచరీలు కావచ్చు.. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆమె ఎప్పుడూ తనను తాను మలచుకుంది.
నిన్న(గురువారం) రాత్రి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని పూనమ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. చాలా ఆలోచించి, ఆత్మపరిశీలన చేసుకున్న తర్వాతే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దేశం కోసం ఆడాలనే తన అంకితభావం, గర్వం ఆ పోస్టులో స్పష్టంగా కనిపించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం తన జీవితంలో అత్యంత గొప్ప గౌరవమని పూనమ్ భావోద్వేగంతో పేర్కొంది. క్రికెట్ అనేది తనకు కేవలం మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదని, తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన గొప్ప పాఠశాల అని చెప్పింది. జీవితంలో ఏ కష్టసమయంలోనైనా ఎదురు నిలవాలని, ఎప్పుడూ ఓటమిని అంగీకరించకూడదని ఈ క్రీడే తనకు నేర్పిందని గుర్తుచేసుకుంది. భారత జర్సీ వేసుకున్న ప్రతీసారీ అపారమైన గర్వం, కృతజ్ఞతా భావం కలిగేవని, ఆ జ్ఞాపకాలను జీవితాంతం పదిలపరుచుకుంటానని తెలిపింది.
Also Read
- కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
చిన్ననాటి కల నెరవేరిన క్షణాలను గుర్తుచేసుకుంటూ, తన సుదీర్ఘ ప్రయాణంలో తనకు లభించిన నమ్మకానికి, మద్దతుకు పూనమ్ కృతజ్ఞతలు తెలిపింది. అభిమానులు, సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందించిన ప్రేమే కష్టకాలంలోనూ ముందుకు నడిపించే శక్తినిచ్చిందని చెప్పింది. అంతర్జాతీయ వేదికపై ఎదగడానికి తనకు అండగా నిలిచిన వారిని ఆమె మరువలేదు. తన క్రికెట్ కెరీర్‌కు గట్టి పునాది వేయడంలో దేశీయ క్రికెట్ పాత్ర ఎంతో ఉందని తెలిపింది. ప్రారంభ రోజుల్లో తనపై నమ్మకముంచి తోడ్పాటు అందించిన ముంబై క్రికెట్ సంఘానికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పింది. ముంబై తరఫున ఆడుతూ దేశీయ క్రికెట్లో పరుగుల వరద పారించానని, అదే జాతీయ జట్టు తలుపులు తట్టేలా చేసిందని గుర్తుచేసుకుంది.
తాజావార్తలు
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!