Pulse Heart Hospitals: హైదరాబాద్‌లో ఎంతో కాలంగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని రోడ్ నంబర్ 4లో విశేష వైద్య సేవలందిస్తున్న పల్స్ హార్ట్ హాస్పిటల్స్, నేడు తన రెండో శాఖని మియాపూర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదివారం ప్రారంభించారు. పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది గుండె, మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌గా వైద్య సేవలందిస్తోంది. ఇది అత్యాధునికమైన వైద్య సౌకర్యాలతో గుండె జబ్బుల చికిత్సలను అందించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. నూతనంగా ఏర్పాటు చేయబడిన ఈ హాస్పిటల్స్ నందు 100 పడకల సదుపాయంతో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్‌లాబ్, అధునాతన ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో ఉన్నతమైన క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, జాయింట్ రీప్లేస్‌మెంట్, పల్మోనాలజీ, యూరాలజీ, గైనకాలజీ, డెర్మటాలజీ, స్పైన్ సర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాలలో పాటు, క్వాటర్నరీ కార్డియాక్ కేర్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
Read Also: Puvvada Ajay Kumar: రాష్ట్రంలో నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుంది
పల్స్ హార్ట్ సెంటర్‌ను 2007లో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎంఎస్‌ఎస్ ముఖర్జీ సమాజంలో విద్య వైద్య సేవలు అందించడం పరమావధిగా ప్రారంభించారు. పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా విస్తరణ కోసం డాక్టర్ సంజూష కుంచా, డాక్టర్ మొవ్వా శ్రీనివాస్, డాక్టర్ క్రాంతికుమార్ ఆయనతో కలిసి ముందుకు నడిచారు. రోగుల పట్ల సానుభూతితో కూడిన వైద్య విధానానికి పేరుగాంచిన పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ “ఆత్మీయతతో కూడిన నాణ్యమైన వైద్యం” అనే నినాదంతో సాగుతుంది. పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇటీవల భారతదేశంలో TRIC, MyVal వాల్వ్‌లను ఉపయోగించి రెండు కుడి వైపు గుండె కవాటాలకు శస్త్రచికిత్స అవసరం లేకుండా మొదటి సారిగా విజయవంతంగా చికిత్స చేసినందుకు వార్తల్లో నిలిచింది. ఈ ఆసుపత్రి సంక్లిష్టమైన యాంజియోప్లాస్టీ, కార్డియాక్ సర్జరీలలో ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.
Read Also: Vemulawada: రాజన్న ఆలయంలో ముగియనున్న ఉత్సవాలు.. నేడు, రేపు ఆర్జిత సేవలు రద్దు
తెలంగాణలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన, అందుబాటు ధరలలో ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రారంభికులు మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. దిగువ, మధ్యతరగతి జనాభా ఆరోగ్య స్థితిని మెరుగుపరచడానికి చిన్న, మధ్య తరహా ఆసుపత్రులను ప్రోత్సహించడంలో తన ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు వైద్య నిపుణులు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. పల్స్ హార్ట్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్న పల్స్ హార్ట్ సెంటర్‌ను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభినందించారు. పల్స్ హార్ట్ ట్రస్ట్ అందిస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో తాను భాగమైన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణలోని ప్రతి ప్రాంతంలోనూ వేగవంతమైన, నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా ఆరోగ్య సంరక్షణ వికేంద్రీకరణ అవసరమని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఆర్థిక, ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐజీ ఎ.వి. రంగనాథ్, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు Ch. విట్టల్, భారతీయ చలనచిత్ర దర్శకుడు బి. సుకుమార్ విశిష్ట అతిథులుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.