హైదరాబాద్‌లో ఎంతో కాలంగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని రోడ్ నంబర్ 4లో విశేష వైద్య సేవలందిస్తున్న పల్స్ హార్ట్ హాస్పిటల్స్, నేడు తన రెండో శాఖని మియాపూర్‌లో ఏర్పాటు చేశారు. ఈ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదివారం ప్రారంభించారు.
దేశంలో మొట్ట మొదటిసారిగా మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ హాస్పటల్స్ ఎండీ డాక్టర్ ముఖర్జీ తెలిపారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా రోగికి చికిత్స చేసి విజయం సాధించామని డాక్టర్లు తెలిపారు.