Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pulivendula Chicken Centre Fire: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. పలు ప్రాంతాల్లో హింస ఆందోళనకు కలిగిస్తోంది.. ఇక, కడప జిల్లా పులివెందులలో వైసీపీ సానుభూతిపరులకు చెందిన చికెన్ సెంటర్కు దుండగులు నిప్పంటించిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అగ్నిప్రమాదానికి గురైన చికెన్ సెంటర్ను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్ధరాత్రి సమయంలో పులివెందులలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
చికెన్ సెంటర్లోని సామగ్రితో పాటు రెండు బైకులను కూడా తగలబెట్టారని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనకు టీడీపీ అనుచరులే కారణమని ఆరోపించారు. టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ప్రధాన అనుచరుడిగా పేర్కొన్న ఆక్కులగారి విజయ్, డైరెక్టర్ కిరికిరి భాష సోదరుడు షామీర్ ఈ ఘటనకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆక్కులగారి విజయ్, షామీర్ పెట్రోల్ క్యాన్లతో చికెన్ సెంటర్లోకి ప్రవేశించి నిప్పంటిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయని ఎంపీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు.
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
- YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
- YS Jagan Pulivendula Visit: పులివెందులకు వైఎస్ జగన్.. నేడు ప్రజాదర్బార్, రేపు వైఎస్సార్కు నివాళి
పుంగనూరు, రాయచోటి ఘటనలపైనా ప్రస్తావన
గతంలో పుంగనూరు, రాయచోటిలో చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల ఘటనను కూడా అదే తరహాలో పరిగణిస్తే, ఇక్కడ ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితులపై సందేహాలు తలెత్తుతాయని అన్నారు. వై కేటగిరీ భద్రత కలిగిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. అలాగే పులివెందులలో వైసీపీ కార్యాలయం వద్ద వాహనానికి నిప్పంటించి బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి
పుంగనూరు, రాయచోటి ఘటనలను రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కోరారు. పోలీసులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే తాము కూడా ఎంతదూరమైనా వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. పులివెందుల ఘటనపై పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?