Extra Ordinary Man : భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్.. విజయం సాధిస్తాడా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్నాడు.ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నాడు.డిసెంబర్ 8న ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా నితిన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన మూవీగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ నిలిచింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 24 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ విడుదల అవుతోంది.ఆంధ్రాలో అత్యధికంగా 9 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. నైజాంలో దాదాపు ఏడు కోట్ల వరకు ఓన్‌గానే నితిన్ తండ్రి సుధాకర్‌రెడ్డి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు సమాచారం.అలాగే సీడెడ్‌లో మూడు కోట్లు మరియు ఓవర్‌సీస్‌లో రెండున్నర కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తుంది.
గతంలో నితిన్ నటించిన రంగ్ దే సినిమాకు మాత్రమే 24 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ప్రస్తుతం నితిన్‌కు ఉన్న మార్కెట్ ప్రకారం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌తో నితిన్ రిస్క్ చేయబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.నితిన్ సినిమాకి పోటీగా నాని హాయ్ నాన్న సినిమా కూడా విడుదల కాబోతుంది.హాయ్ నాన్న సినిమాతో హీరో నాని నుంచి గట్టి పోటీ ఉండటంతో నితిన్ యూత్ ప్రేక్షకులపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు. మరోవైపు రీసెంట్ గా రిలీజ్ అయిన యానిమల్ మూవీ హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. యానిమల్ మూవీ ని కాదని యూత్‌ను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకు రప్పించడం అంటే ఛాలెంజ్ అనే బాక్సాఫీస్ వర్గాలు చెబుతోన్నాయి.ఈ అడ్డంకులను దాటుకొని నితిన్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధిస్తుందో లేదో చూడాలి.ఇదిలా ఉంటే ఎక్స్‌టా ఆర్డినరీ మ్యాన్ మూవీ లో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. దీనితో సినిమాపై భారీగానే అంచనాలు వున్నాయి..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!