తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సెక్రటేరియట్ వద్ద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగులు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని తెలిపారు.