టాలీవుడ్‌లో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు.. భాగ్యశ్రీ బోర్సే . తాజాగా వరుసగా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకుంటోంది. దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ తో ఎంట్రీ ఇచ్చి పెద్దగా ఆకట్టుకోకపోయినా, ఆ సినిమా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారిపోయింది. దాంతో పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోలు భాగ్యశ్రీ వైపుగానే చూడటం మొదలుపెట్టారు.
Also Read :Amala : తన బాల్యం, పుట్టింటి గురించి మొదటిసారిగా ఓపెన్ అయిన అమల – ఎన్నో తెలియని సంగతులు బయటకు!
విజయ్ దేవరకొండ తో చేసిన ‘కింగ్డమ్’ భారీ అంచనాల మధ్య విడుదలై పరాజయం పొందింది. అంతే కాదు దుల్కర్ సల్మాన్ ‘కాంత’ కూడా తెలుగులో సరిగా రాణించలేదు. కానీ ఈ వరుస ఫలితాలు భాగ్యశ్రీ స్పీడ్‌ను మాత్రం తగ్గించలేదు. ఇదే నెలలో రామ్ పోతినేనితో కలిసి నటించిన ‘ఆంధ్రకింగ్ తాలూకా’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో పాల్గొన్న భాగ్యశ్రీ మాట్లాడుతూ..
“అభిమానం అనేది గొప్ప భావన. ఎలాంటి పరిచయం లేకపోయినా మనల్ని ప్రేక్షకులు ఇంతలా ప్రేమిస్తారంటే అది మ్యాజిక్‌లాంటిది” అని చెప్పింది. ‘‘ఉత్తరాది నుంచి తెలుగులోకి వచ్చిన నాకు, ఇక్కడి ప్రేక్షకులు ఒక స్టార్‌ను దేవుడిలా అభిమానిస్తారని ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను. ఆ అభిమానమే మా చిత్రంలో బేస్ లాంటిది. సినిమాలో నేను మహాలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. కాలేజీ చదువుతున్న ఆమె, రామ్ పోషించిన సాగర్ తో ప్రేమలో పడుతుంది. ఇంతకన్నా స్టోరీ గురించి ఏమీ చెప్పలేను’’ అని నవ్వింది.
తన డ్రీమ్ పాత్రల గురించి మాట్లాడుతూ.. “వచ్చే ప్రతి రోల్‌కి 100% న్యాయం చేస్తూ మంచి నటి అని పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంది. ప్రత్యేకంగా… అనుష్క చేసిన అరుంధతి లాంటి పవర్‌ఫుల్ పాత్రలు చేయాలని నా కల. నన్ను అందరూ తెలుగమ్మాయిగా ప్రేమిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రేమ, గౌరవం ఇంకా ఎక్కువగా రావాలని కోరుకుంటున్నా” అని భాగ్యశ్రీ చెప్పింది.