NTV Telugu Site icon

Priyanka Gandhi : ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ.. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని…

Priyanka Gandhi

Priyanka Gandhi

వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికైన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక పార్లమెంట్ హౌస్‌కి చేరుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె పేరు పిలవగా.. నూతన ఎంపీ చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని.. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆహార్యంలో వచ్చారు. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసే ముందు రాజ్యాంగ పుస్తకాన్ని తీసుకెళ్లడం కనిపించింది. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా అదే పరంపర సాగించారు.

READ MORE: CM Revanth Reddy: విద్యార్థుల‌ను క‌న్న బిడ్డ‌ల్లా చూడాలి.. జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు సీఎం సూచన..

కాగా.. ప్రియాంక గాంధీ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ లోక్ సభ ఉప ఎన్నిక‌ల్లో సరికొత్త రికార్డు న‌మోదు చేశారు. అత్యధిక మెజారిటీతో విజ‌యాన్ని న‌మోదు చేశారు. గ‌తంలో ఆ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె సోద‌రుడు రాహుల్ గాంధీ సుమారు 3 లక్షల 65 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, రాహుల్ రాజీనామాతో ఆ స్థానం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన ప్రియాంకా గాంధీ.. ఈ ఉప ఎన్నిక‌లో విజయం సాధించారు. ఇక, రాహుల్ గాంధీ మెజారిటీని ఇప్పటికే ప్రియాంక గాంధీ దాటేసింది. తాజాగా.. ప్రియాంకా 4 లక్షల 3 వేల 966 ఓట్ల మెజారిటీ సాధించారు. ప్రియాంకాకు 5.78 లక్షల ఓట్లు పోల‌వ్వగా.. సెకండ్ ప్లేస్ లో క‌మ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోక‌రి ఉండగా.. ఇక, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి న‌వ్య హ‌రిదాస్ 10 వేల ఓట్లతో మూడ‌వ స్థానంలో కొనసాగారు.

READ MORE: TTD: సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి ఆనం