అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి విలువ భారీగా పడిపోతుంది. ఈ మధ్య కాలంలో బాగా పతనం అయింది. దీంతో ప్రధాని మోడీని వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. రూపాయి పతనంపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 86.04కి చేరుకుంది. దీంతో ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రియాంక.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చరిత్రలోనే తొలిసారిగా రూపాయి మారకం విలువ కనిష్ఠ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Tusli Leave : చలికాలంలో ప్రతిరోజూ తులసి ఆకులను తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 58-59గా ఉండేది. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ రూపాయి విలువపై విమర్శలు గుప్పించారు. డబ్బు విలువ ఏ దేశంలోనూ ఇంతగా పడిపోదని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడేమైంది? మోడీనే ప్రధానిగా ఉన్నారని.. పతనంలో రూపాయి రికార్డులు సృష్టిస్తోందని గుర్తుచేశారు. రోజు రోజుకూ దాని విలువ పడిపోతోందని.. అందువల్ల దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: APCOB: డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఏపీ-కో-ఆపరేటివ్ బ్యాంక్ లో జాబ్స్ రెడీ.. నెలకు రూ. 57 వేల జీతం
ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే స్టాక్ మార్కెట్ వాతావరణం బాగుంటుందని నిపుణులు భావించారు. అన్నట్టుగానే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ మార్కెట్లో ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ మధ్య అయితే మార్కెట్ భారీగా పతనం అవుతోంది. లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇక ఈనెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. వైట్‌హౌస్‌లోకి ట్రంప్ ఎంట్రీ ఇచ్చాక.. మార్కెట్లో ఏమైనా మార్పులు ఉంటాయేమో చూడాలి.
डॉलर के मुकाबले रुपये की कीमत अब तक के सबसे निचले स्तर पर पहुंच गई है। इतिहास में पहली बार एक डॉलर की कीमत 86.4 रुपये हो गई है।
डॉ. मनमोहन सिंह जी के कार्यकाल में जब एक डॉलर की कीमत 58-59 रुपये थी, तब नरेंद्र मोदी जी रुपये की कीमत को सरकार की आबरू से जोड़ते थे। वे कहते थे,… pic.twitter.com/IOG3oaUeA3
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) January 11, 2025