APCOB: డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఏపీ-కో-ఆపరేటివ్ బ్యాంక్ లో జాబ్స్ రెడీ.. నెలకు రూ. 57 వేల జీతం
- ఏపీ-కో-ఆపరేటివ్ బ్యాంక్ లో జాబ్స్
- డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి గోల్డెన్ ఛాన్స్
- నెలకు రూ. 57 వేల వరకు జీతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచి జాబ్ సాధించాలని డెడికేషన్ తో ప్రిపరేషన్ సాగిస్తున్నారా? జాబ్ సాధించడమే మీ లక్ష్యమా? డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నారా? జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మంచి జీతంతో బ్యాంక్ జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 251 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లోని డిస్ట్రిక్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల్లో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభమైంది.
భర్తీ కానున్న పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్ 50, స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ 201 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పోటీపడే వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ భాషలపై పట్టుండాలి. దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 31.10.2024 నాటికి 20 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.26,080- రూ.57,860 వరకు జీతం ఉంటుంది. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.
Also Read
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
అప్లికేషన్ ఫీజు జనరల్/బీసీ అభ్యర్థులకు రూ.700 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు జనవరి 22 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం apcob.org/careers/ వెబ్ సైట్ను సందర్శించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో అప్లై చేసుకునేందుకు ibpsonline.ibps.in/dccbmarc24/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?