AP Elections 2024: ఎన్నికల టైం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారానికి తెర పడనుంది. మరో రెండు రోజుల్లో అంటే మే 13న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల వేళ ప్రైవేట్ ట్రావెల్స్ రెచ్చిపోతున్నాయి. ప్రయాణికులను అడ్డంగా దోచేస్తున్నాయి. ఉద్యోగాలు, చదువుల పేరుతో ప్రజలు సొంత ఊర్లకు దూరంగా ఎక్కడెక్కడో సెటిల్ అయిన జనాలు.. సొంత ఊర్లకు పయనం అవుతున్నారు. శనివారం నుంచి సోమవారం వరకు వరుసగా సెలవులు ఉండటంతో.. ఓటేయడం కోసం తమ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు ఫుల్ అయిపోయాయి. దీంతో.. ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ప్రైవేట్ ట్రావెల్స్ జనాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి.
Read Also: Rohit Sharma: ఇదే నా చివరి సీజన్.. అది నా ఇల్లు బ్రదర్..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవడం గ్యారెంటీ. మామూలు రోజుల్లో సొంత ఊర్లకు వెళ్లాలంటే.. 500నుంచి వేయి రూపాయలు అవుతుంది. కానీ.. ఇప్పుడు మాత్రం ఏకంగా మూడు, నాలుగు రెట్లు పెంచేసాయి ప్రైవేట్ ట్రావెల్స్. అంటే.. వెయ్యి రూపాయలు అయ్యే చోట ఇప్పుడు ఏకంగా 5 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఓ కుటుంబం నుంచి ఇద్దరు ఊరికి వెళ్లి ఓటు వేసి రావాలంటే.. 10 నుంచి 15 వేలు ఖర్చవుతోంది.
Read Also: KKR vs MI: కోల్‌కతాతో కీలక పోరుకు సిద్ధమైన ముంబై..
ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ టికెట్ రేట్లు 2500 నుంచి 5 వేల వరకూ చూపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కడప, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలాంటి ప్రధాన నగరాలకు కూడా ఇదే రేంజులో టికెట్ రేట్లు ఉన్నాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రయాణీకులు సొంతూళ్లకు వెళ్తుండటంతో.. సిటీలోని అన్ని ప్రాంతాలూ బస్సులతో రద్దీగా మారాయి. బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మరోవైపు ప్రయాణికుల రద్దీని దృష్టిలోఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులందించే దాదాపు 20కి పైగా రైళ్లకు తాత్కాలికంగా అదనపు కోచ్‌లను ఏర్పాటుచేసింది. దీంతో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?