కామారెడ్డి – జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్దాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 420 హామీల్లో ఇప్పటికి అమలైంది ఉచిత బస్సు మాత్రమే, అది సక్రమంగా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కొండంత హామిలు ఇచ్చి ..గోరంత పనులు చేయడం లేదని, కేసీఆర్ పథకాలు ఒక్కటి కూడా…
ఇందూరు ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ సీఎంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రధాని పచ్చి అబద్దాల కోరు అని నిజామాబాద్ సభ ద్వార మరోసారి నిరూపించారన్నారు. కేటిఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటే నీ బోడి సహాయం ఎవరికి కావాలని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మీ’ పథకానికి సంబంధించి ఆర్ అండ్ బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించే గృహలక్ష్మీ పథకానికి ఎలాంటి గడువు లేదని మంత్రి స్పష్టం చేశారు.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురికి నిందుతులకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రేణుక,డి రమేష్, ప్రశాంత్ రెడ్డి లకు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం-కేంద్రం మధ్య ధాన్యం విషయంలో మాటల యుద్ధం సాగుతోంది. ఢిల్లీ సాక్షిగా కేంద్ర ఆహారమంత్రి పీయూష్ గోయల్- రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాదులాట చోటుచేసుకుంది. “పంజాబ్ తరహాలో బియ్యాన్ని కొనుగోలు చేసినట్టే తెలంగాణలో కూడా బియ్యాన్ని కొనండన్నారు ప్రశాంత్ రెడ్డి. దీనికి ప్రతిగా “పంజాబ్ లాగానే, తెలంగాణ కూడా బియ్యాన్ని సరఫరా చేయండని సమాధానం ఇచ్చారు పీయూష్ గోయల్. తెలంగాణ లో వాతావరణ పరిస్థితుల రీత్యా యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే…
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈసారి గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ప్రసంగం వుండడం లేదు. ఈ వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శల్ని తీవ్రంగా తిప్పికొట్టారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలపై బీజేపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. సీఎం కెసిఆర్ సమక్షంలో సభలు హుందాగా జరిగాయి..జరగబోతున్నాయి. అధికార పార్టీ సభ్యుల కంటే…ప్రతిపక్ష పార్టీ సభ్యులకే ఎక్కువ సమయం ఇస్తుంది మేమే. విపక్ష సభ్యులు ఇక చాలు అనే వరకు సమాధానాలు ఇస్తున్నాం. .…