ప్రశాంత్ కిషోర్.. రాజకీయ ఎన్నికల వ్యూహకర్త. దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలకు వ్యూహకర్తగా పని చేశాడు. తన వ్యూహాలతోనే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో తీసుకొచ్చినట్లుగా కబుర్లు చెబుతుంటారు. కానీ సొంత రాష్ట్రంలో మాత్రం చతికిలపడ్డారు. బీహార్ ఎన్నికల ముందు నుంచి కూడా ఈసారి నితీష్ కుమార్ కూటమి ఘోరంగా ఓడిపోబోతుందని.. ఈసారి రాష్ట్రంలో మార్పు ఖాయమంటూ ఒకటే డప్పు కొట్టారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేటప్పటికీ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఈసారి బీహారీయులు మార్పు కోరుకుంటున్నారని.. జన్ సురాజ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని కథలు చెప్పారు. తీరా ఫలితాలు వచ్చేటప్పటికీ మాత్రం తన రాజకీయ వ్యూహమంతా అట్టర్ ప్లాప్ అయింది.
ఇది కూడా చదవండి: Bihar Election Results: కూటమిని ముంచిన కాంగ్రెస్.. హస్తం పార్టీ పేలవ ప్రదర్శన..
శుక్రవారం ఉదయం బీహార్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పుడు పోస్టల్ కౌంటింగ్లో రెండు స్థానాల్లో ముందంజలో ఉండగా ప్రస్తుతం అది కూడా లేదు. ప్రస్తుతం ‘జీరో’ స్థానంలో జన్ సురాజ్ పార్టీ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రభావం చూపించలేదు. సర్వేలు చెప్పినట్లుగానే ఎన్డీఏ కూటమి వైపే బీహారీయులు మొగ్గు చూపారు. భారీ విక్టరీ దిశగా అధికార కూటమి దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 181 స్థానాల్లో కొనసాగుతుండగా.. మహాఘట్బంధన్ కూటమి 57 స్థానాల్లో కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Maithili Thakur: విజయం దిశగా మైథిలి ఠాకూర్.. రాజకీయ కురువృద్ధుడ్ని వెనక్కినెట్టిన గాయని