బీహార్ లో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 6 నో మొదటి దశ, 11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ప్రకటించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బీహార్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలంటూ భవిష్యవాణి వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై ప్రశాంత్ కిషోర్ అంచనాలు వెల్లడించారు.
Also Read:Kejriwal: భారత ఆత్మపై దాడి చేశారు.. గవాయ్‌పై దాడిని ఖండించిన కేజ్రీవాల్
ఈ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ ఏమాత్రం ముఖ్యమంత్రి గా ఉండబోరు అని చెప్పారు. ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్నానని అన్నారు. బీహార్ ప్రజలు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఓట్లు వేయబోతున్నారని తెలిపారు. బతుకుదెరువు వలసలకు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయబోతున్నారని వెల్లడించారు. పాట్నా లోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో వచ్చే ఏడాది జనవరిలో “మకర సంక్రాంతి” సంబరాలను
నితీష్ కుమార్ చేసుకోరు అని తెలిపారు.
బీహార్ లో సరికొత్త రాజకీయ వేదిక “జన్ సురాజ్ పార్టీ” (జే.ఎస్.పి) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ అంచనాలు హాట్ టాపిక్ గా మారాయి. “ఎన్నికల వ్యూహకర్త”గా సుదీర్ఘకాలం పనిచేసి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన “జన్ సురాజ్ పార్టీ” (జే.ఎస్.పి) వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్. నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను అని తెలిపారు. అయుతే, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది వెల్లడించలేదు. అభ్యర్ధుల జాబితాను రేపు ప్రకటించనున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయి అశ్చర్యకరమైన రీతిలో అభ్యర్థుల జాబితా ఉండబోతోందన్నారు. రెండు కూటముల ఓట్లను “జన్ సురాజ్ పార్టీ” ఖచ్చితంగా కొల్లగొట్టబోతోందని ప్రజలంటున్నారని తెలిపారు. “జన్ సురాజ్ పార్టీ” కి 48 శాతం ఓట్లు వస్తాయని అన్నారు.
Also Read:Adivi Sesh : అడివిశేష్ ‘డెకాయిట్’ క్రిస్మస్ రిలీజ్ వాయిదా..
గత ఎన్నికల్లో రెండు కూటములకు 72 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఇంతవరకు “ఎన్.డి.ఏ” కూటమికి గానీ, “మహాఘఠ్ బంధన్” కూటమి కానీ ఓటు వేయని ఓటర్లంతా “జన్ సురాజ్ పార్టీ” కే ఓటు వేస్తారని తెలిపారు. మిగిలిన 28 శాతం ఓట్లు “జన్ సురాజ్ పార్టీ” (జే.ఎస్.పి) కి వస్తాయని అంచనా వేశారు. అలాగే, ఒక్కో కూటమి నుంచి 10 శాతం ఓట్లు “జే.ఎస్.పి” కి వస్తాయని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. మొత్తంగా, బీహార్ లోని ఓటర్లలో 48 శాతం ఓట్లు “జే.ఎస్.పి” కి వస్తాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.