బీహార్ లో ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 6 నో మొదటి దశ, 11న రెండో దశ పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈసీ ప్రకటించారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బీహార్ లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇవే…
NDA CMs Key Meeting: ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం దేశ రాజధానిలోని ఓ హోటల్ లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.
డిసెంబర్ 9న మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గిన సంగతి తెలిసిందే. విశ్వాస పరీక్ష అనంతరం ప్రస్తుతం అందరి దృష్టి మహాయుతి కూటమి మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్‌లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోందని.. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.
New Parliament: మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీతో సహా 19 పార్టీలు బహిష్కరించాయి.
కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జానీ నెల్లూరు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశారు. కేరళ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత, జానీ నెల్లూరు జాతీయ సెక్యులర్ పార్టీని ఏర్పాటు చేస్తానని, అది భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో చేరుతుందని చెప్పారు.
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. గెలిచేది ఎవరు? మళ్లీ ప్రధాని అయ్యేది ఎవరు? అంటూ ఇండియా టీవీ ‘వాయిస్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఒపీనియన్ పోల్ నిర్వహించింది… ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది.. ఉన్నట్టుండి ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా వేసింది.. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు…
ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు రానున్న ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి