Pranay Amrutha: ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం జరిగింది.. అమృత ఎమోషనల్ పోస్ట్
- సోషల్ మీడియా వేదికగా అమృత ఎమోషనల్ పోస్ట్
- ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పుపై ప్రణయ్ భార్య అమృత మొదటిసారి స్పందన.
- ప్రశాంతంగా ఉండు ప్రణయ్ అంటూ ఎమోషనల్ పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pranay Amrutha: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత, ప్రణయ్ భార్య అమృత మొదటిసారి స్పందించారు. ఆమె భావోద్వేగాలతో నిండిన సందేశాన్ని సోషియల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఇన్నాళ్లుగా ఎదురుచూసిన న్యాయం నాకు చివరికి లభించింది. నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది” అని అమృత తెలిపారు. కోర్టు తీర్పుతో తాను ఊపిరిపీల్చుకున్నానని, చాలా రోజులుగా ఎదురుచూస్తున్న న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు.
Read Also: Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Also Read
ఈ తీర్పుతో పరువు కోసం జరిగే హత్యలు, ఇలాంటి దారుణాలు ఇకనైనా ఆగాలని అమృత ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఎదుర్కొన్న బాధను మరెవరూ అనుభవించకూడదని, సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు. తన కుమారుడు పెద్దవాడవుతున్నందున, అతడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, అలాగే తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా మీడియా ముందుకు రావడం లేదని అమృత స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో తనకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, ఇంకా మీడియాకు అమృత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయం కోసం తనతో పాటు నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా తన భర్త ప్రణయ్‌ను తలచుకుంటూ “ప్రశాంతంగా ఉండు ప్రణయ్” అని ఆమె సోషల్ మీడియా ద్వారా భావోద్వేగపూర్వకంగా ప్రకటించారు. ఈ సందేశం అందరినీ చలించిచేయడమే కాకుండా, ప్రణయ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలియజేసింది.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?