Pranay Amrutha: ప్రణయ్ హత్య కేసులో కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత, ప్రణయ్ భార్య అమృత మొదటిసారి స్పందించారు. ఆమె భావోద్వేగాలతో నిండిన సందేశాన్ని సోషియల్ మీడియా ద్వారా పంచుకున్నారు. “ఇన్నాళ్లుగా ఎదురుచూసిన న్యాయం నాకు చివరికి లభించింది. నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది” అని అమృత తెలిపారు. కోర్టు తీర్పుతో తాను ఊపిరిపీల్చుకున్నానని, చాలా రోజులుగా ఎదురుచూస్తున్న న్యాయమే గెలిచిందని పేర్కొన్నారు. Read Also: Assembly Sessions: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు…
ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై ఇన్‌స్టాగ్రామ్‌లో అమృత స్పందించింది. "ఇన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. న్యాయస్థానంలో న్యాయం జరిగింది. పోలీస్ శాఖకు, వాదనలు వినిపించిన స్పెషల్ పీపీ, సహకరించిన మీడియాకు ధన్యవాదాలు. బాబు ఎదుగుతున్న నేపథ్యం... అతని భవిష్యత్తు, నా మానసిక పరిస్థితి దృష్ట్యా మీడియా ముందుకు రాలేకపోతున్నాను. నా అభ్యర్థనను అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్న." అని అమృత పేర్కొంది.