ఒక వరలో రెండు కత్తులు ఉండవు అన్న విషయం తెలిసిందే.. ఒక ఇంట్లో అత్తాకోడళ్ళు ఉన్నప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి.. కొందరు సర్దుకున్నా కూడా మరికొందరు మాత్రం గొడవల ను పెంచుకుంటూ పోతారు.. ఇప్పుడు ఓ కోడలు అత్త వస్తే కాపురం చెయ్యనని భర్తకు చెప్పేసాడు.. దాంతో అతను తల్లి అడ్డును తొలగించే పనిలో పడ్డారు.. పక్కా ప్లాన్ ప్రకారం అమ్మను చంపేశాడు.. చివరికి పోలీసుల దెబ్బకు అసలు నిజం కక్కేశాడు.. ప్రస్తుతం ఊసలు లెక్కపెడుతున్నారు..ఈ అమానవీయ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది..
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన కె సుబ్బులమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మరణించాడు. దీంతో కుమారుడు శ్రీనివాసరావు, కోడలితో కలిసి జీవనం సాగిస్తోంది. ఐతే అత్త, కోడళ్లకు క్షణం కూడా పడేదికాదు. కొడుక్కి పెళ్లై ఏళ్లు గడుస్తున్నా వీరిద్దరి మధ్య వివాదాలు సర్దు మనగలేదు. ఈ క్రమంలో ఇటీవల శ్రీనివాసరావు అదే గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు. రెండురోజుల క్రితం ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేసిన శ్రీనివాసరావు భార్య అత్తగారు ఆ ఇంట్లో అడుగుపెడితే తాను ఉండబోనంటూ తెగేసి చెప్పింది…
భార్య కోసం ఆ కొడుకు కన్న పేగును కూడా మరచి తల్లి అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు..ఈ క్రమంలో బుధవారం రాత్రి అందరూ నిద్రపోయాక తల్లిని బైక్ పై కూర్చోపెట్టుకుని ఊరి చివర ఉన్న చిన్నమ్మకుంట వద్దకు తీసుకెళ్లి, అందులోకి ఆమె ను తోసేశాడు. ఆ తర్వాత ఏం ఎరగనట్లు ఇంటికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం కుంటలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారం అందిచారు.. వెంటనే ఘటనా స్థలాని కి వచ్చిన పోలీసులు మృతదేహన్ని పరిశీలించి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. కొడుకును గట్టిగా నిలాదీయడం తో అసలు విషయం బయట పెట్టాడు.. నేరం చేసినట్లు అంగీకరించాడు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..