టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు సాధించి సత్తా చాటారు. అయితే, ఇటీవల ‘3 రోజెస్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన ప్రగతి ఈ పతకాలను ఇండస్ట్రీలోని మహిళా ఆర్టిస్టులకు అంకితం చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తాను మీడియాకు కొంచెం దూరంగా ఉంటానని, ఎక్కడ ట్రోల్ చేస్తారోనన్న భయంతో అలా ఉంటున్నట్లు చెప్పారు. అలాగే పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ప్రగతి గట్టిగా మాట్లాడారు.. ‘నేను సినిమాలు మానేసి పవర్ లిఫ్టింగ్ చేస్తున్నానని అంతా అన్నారు. కానీ, నేను యాక్టింగ్ ఎప్పటికీ మానలేను. నా గుర్తింపు, నేను అన్నం తినడానికి కారణం ఈ ఇండస్ట్రీనే. అందుకే చనిపోయే వరకు నటిస్తూనే ఉంటాను’ అని తన వృత్తిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసింది. అలాగే
Also Read : MSVPG: పాటలు ఒకే.. అసలైన కంటెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
సరదాగా మొదలుపెట్టిన పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధించినప్పటికీ, జిమ్‌లో తన దుస్తులపై వచ్చిన విమర్శలు.. ఈ వయసులో ఇదంతా అవసరమా అన్న మాటలు తనను చాలా బాధించాయన్నారు.. ‘జిమ్‌కు అలాంటి దుస్తుల్లోనే వెళ్లాలి. చీర కట్టుకుని జిమ్ చేయలేను కదా’ అని ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ట్రోల్స్ చూసి తాను తప్పు చేస్తున్నానేమోనని, తన కూతురికి ఇబ్బంది అవుతుందేమోనని భయపడ్డాను, కానీ ధైర్యంగా ముందుకు వెళ్లానని చెప్పారు. చివరికి, తనను ట్రోల్ చేసిన వారికి ఈ పతకాలతో సమాధానం ఇచ్చానని గర్వంగా తెలిపారు. ఇండస్ట్రీలో లేడీ యాక్టర్‌గా కెరీర్ ముందుకు తీసుకెళ్ళడం ఎంత కష్టమో నాకు తెలుసు, అందుకే మహిళా ఆర్టిస్టులకు ఈ పతకాలు అంకితం ఇస్తున్నట్లు చెప్పి.. ‘మీరు మాకు ఏమిచ్చినా, ఇవ్వకపోయినా కనీసం మర్యాద ఇవ్వండి’ అంటూ ట్రోలర్స్‌ను ఉద్దేశించి ప్రగతి విజ్ఞప్తి చేశారు.