కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా కమల్ హాసన్ దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్ కార్యక్రమంలో కన్ఫామ్ చేసాడు.
అయితే ఈ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ తెరకెక్కించడం లేదని ఇటీవల వార్తలు వినిపించాయి. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకు కథ మాత్రమే అందిస్తాడని ఆ కథతో తమిళ యంగ్ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగరనాధ్ దర్శకత్వంలో రజనీకాంత్ – కమల్ హాసన్ సినిమా చేస్తారని తమిళ సినీ మీడియా కోడై కూసింది. కానీ అధికారకంగా ప్రకటన రాలేదు. తాజాగా ఈ వార్తలపై స్పందించాడు ఈ హీరో కమ్ దర్శకుడు ప్రదీప్ రంగనాధ్. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నేను సూపర్ స్టార్ కు బిగ్ ఫ్యాన్. ఆయన సినిమా ఏది నెను ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవను. అలాగే రజనీ – కమల్ సినిమాను నేను డైరెక్ట్ చేయడం లేదు. నేను ప్రస్తుతం నటనపై మాత్రమే దృష్టి పెట్టాను. అసలు రజనీ – కమల్ సినిమా డైరెక్షన్ కోసం నాకు ఆఫర్ వస్తుందో లేదో నేను ఇప్పుడే చెప్పలేను” అని క్లారిటీ ఇచ్చేసాడు.