Salar : ప్రభాస్ అతివల కలల రాకుమారుడు. బాహుబలి సినిమాతో తన రేంజును అమాంతం పెంచేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. రాధేశ్యామ్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ సిల్వర్ స్ర్కీన్ పై కనిపించి చాలా కాలం అవుతోంది. గత చిత్రాలతో నిరాశ పరిచిన ప్రభాస్ చేతినిండా సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటిలో ముందుగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెలాఖరు నుంచి చిత్రం ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది.
Read Also :Same-Gender Marriage: స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన కేంద్రం.. ఇది కోర్టుల పని కాదని సూచన..
ఆ తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమాపై ప్రభాస్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా గురించి తాజాగా ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. బాహుబలి, కేజీఎఫ్ మాదిరిగా ఈ చిత్రం రెండు భాగాల్లో తెరపైకి రానుంది. చిత్ర బృందం దీనిపై అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సలార్ లో కీలక పాత్ర చేస్తున్న కన్నడ నటుడు దేవరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. సలార్ లో ప్రభాస్ రెండు పాత్రలు చేస్తున్నారు. అందులో ఒకటి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అని తెలుస్తోంది. దేవా అనే పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. మొదటి భాగంలో కంటే రెండో పార్ట్‌లో ప్రభాస్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. కేజీఎఫ్ లోనూ ప్రశాంత్ నీల్.. యష్ ను నెగిటివ్ క్యారెక్టర్‌లోనే చూపెట్టి సక్సెస్ అయ్యారు. గతంలో ప్రభాస్ ‘బిల్లా’ చిత్రంలో నెగెటివ్ షెడ్స్ ఉన్న పాత్ర చేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మళ్లీ అలాంటి పాత్ర చేస్తున్నారని తెలియగానే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమాపై ఆసక్తిగా ఉన్నారు. సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.
Read Also :Gidugu Rudraraju: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. పార్టీని వీడినవారు తిరిగి రండి..!