Prabhas: ప్రభాస్ ఆతిథ్యానికి ఫిదా అయిన మలయాళ డైరెక్టర్.. క్రేజీ కాంబోపై ఫిక్స్ అయ్యిందా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ – మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ దిన్జిత్ అయ్యతాన్ మధ్య జరిగిన తాజా సమావేశం ఇప్పుడు సినీ వర్గాల్లో సెన్సేషన్‌గా మారింది. హోంబలే ఫిల్మ్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీ, రాబోయే రోజుల్లో ఒక భారీ ప్రాజెక్టుకు నాంది కానుందా? అనే చర్చలకు తెరలేపింది. నిన్న రాత్రి జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన విశేషాలను దిన్జిత్ అయ్యతాన్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “సూపర్‌స్టార్ ప్రభాస్‌తో అద్భుతమైన సాయంత్రం గడిచింది. గొప్ప సంభాషణలు, నవ్వులు, రుచికరమైన డిన్నర్ మధ్య ఈ మీటింగ్ సాగింది. ముఖ్యంగా ప్రభాస్ గారు వడ్డించిన ‘ప్రాన్స్ బిర్యానీ’ అమోఘం! మీ అద్భుతమైన ఆతిథ్యానికి ధన్యవాదాలు ప్రభాస్ సార్. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విజయ్ సార్, హోంబలే ఫిల్మ్స్‌కు నా కృతజ్ఞతలు” అంటూ దిన్జిత్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
READ ALSO: No-Cook Breakfast Recipes: గ్యాస్ అవసరమే లేదు, ఈ వంటకాలను ఈజీగా చేసుకోండి..
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ దిన్జిత్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కిష్కింధ కాండం (2024) మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఇది డిస్నీ+ హాట్‌స్టార్‌లో ట్రెండ్ అవుతోంది. ఏకో (2025) సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కేవలం 25 రోజుల్లోనే రూ.23.93 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి 2025లో మోస్ట్ ప్రాఫిటబుల్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవల తమిళ స్టార్ ధనుష్ కూడా ‘ఏకో’ చిత్రాన్ని ‘మాస్టర్‌పీస్’ అని కొనియాడటం విశేషం.
ప్రభాస్ ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్‌తో భారీ ‘మల్టీ-ఫిల్మ్ డీల్’ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ‘సలార్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే హోంబలే ఫిల్మ్స్ స్వయంగా దిన్జిత్ అయ్యతాన్ను ప్రభాస్‌తో కలిపించడంతో, వీరిద్దరి కాంబోలో ఒక విభిన్నమైన థ్రిల్లర్ మూవీ రాబోతుందనే అంచనాలు ప్రేక్షకుల్లో పెరుగుతున్నాయి. ప్రభాస్ ఇమేజ్ – దిన్జిత్ మేకింగ్ స్టైల్ కలిస్తే ఇండియన్ స్క్రీన్‌పై మరో అద్భుతం ఆవిష్కృతం కావడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
READ ALSO: ఎగుమతిదారులకు JNPA భారీ ఛార్జీల మినహాయింపు.. మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం!
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!