Kalki 2898 AD : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ ముఖ్య పాత్రలలో నటించారు.ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో బిజీ గా వుంది.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.
Read Also :Devara : థాయిలాండ్ లో దేవర రొమాంటిక్ డ్యూయెట్ ..
అలాగే ఈ చిత్రం నుండి మేకర్స్ భైరవ యాంతంను కూడా రిలీజ్ చేయగా ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది.తాజాగా చిత్ర యూనిట్ కల్కి రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసారు.హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.ఇదిలా ఉంటే కల్కి టీం కి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.రాష్ట్రంలో కల్కి మూవీ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సింగల్ స్క్రీన్ లో రూ. 75 ,మల్టీప్లెక్స్ లో రూ .100 చొప్పున ధరలు పెరగనున్నాయి.అలాగే రిలీజ్ రోజు ఉదయం 5.30 గంటల బెన్ఫిట్ షో కు రూ.200 రూపాయలు అదనంగా ఉండనున్నట్లు సమాచారం.పెరిగిన ధరలు జులై 4 వరకు అమలులో ఉన్నట్లు తెలుస్తుంది.అలాగే ఆంధ్రప్రదేశ్ లో టికెట్స్ పెంపు విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది.