Prabhas Fauji : ప్రభాస్ ‘ఫౌజీ’ స్పీడ్ మామూలుగా లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఆరంభంలో రాజాసాబ్‌తో ఫ్లాప్ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇదే ఏడాదిలో సాలిడ్ హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సీతారామం తర్వాత దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అఫీషియల్‌గా ప్రకటించనప్పటికీ.. వచ్చే దసరాకు ఫౌజీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కానీ ఈ ఏడాది డిసెంబరు పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
Also Read : Dacoit Overseas Review : డెకాయిట్ ఓవర్శీస్ రివ్యూ.. సగం ఉడికిన ప్రేమ వ్యధ
Also Read
అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాను ముందుగా అనుకున్న సమయానికే ప్రేక్షకులకు అందించాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం నిర్మాణ పనులను ముమ్మరం చేస్తూ ఏకకాలంలో షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. షెడ్యూల్ ప్రకారం సినిమాను పూర్తి చేయడం కోసం మేకర్స్ ‘సెకండ్ యూనిట్’ను కూడా రంగంలోకి దించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఒక వైపు ప్రధాన తారాగణంపై దర్శకుడు హను రాఘవపూడి అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, మరోవైపు ఈ సెకండ్ యూనిట్ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌ను షూట్ చేస్తోందట. ఇలా రెండు యూనిట్‌లతో పని చేయడం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా అవుట్‌పుట్ వస్తుందని టీమ్ భావిస్తోంది. కాబట్టి.. దసరాకు ఫౌజీ రిలీజ్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. కాకపోతే.. మేకర్స్ నుంచి ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!