Dacoit Overseas Review : డెకాయిట్ ఓవర్శీస్ రివ్యూ.. సగం ఉడికిన ప్రేమ వ్యధ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన అంచనా ఉంటుంది. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన శేష్ ఈసారి ‘డెకాయిట్‘ అనే ఒక యాక్షన్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత రాత్రి ప్రీమియర్స్ తో రిలీజ్ అయినా ఈ సినిమా ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే…
సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా మొదలై మొదటి 30 నిమిషాల వరకు వచ్చే లవ్ స్టోరీ ఉంటుంది కానీ అందులో ఎమోషన్ ఉండదు. అనవసరమైన పాటలు సినిమా వేగాన్ని అడ్డుకున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత సినిమా పుంజుకుని కొద్దిసేపటికే స్లో అవుతుంది. కొన్ని సన్నివేశాలు చాలా చక్కగా రాసుకున్నప్పటికీ ఎడిటింగ్ స్టైల్ మాత్రం అడివి శేష్ గత సినిమాలనే గుర్తుచేస్తుంది. ముఖ్యంగా ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి సినిమాల ఛాయలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి, దీనివల్ల కొన్ని సీన్లు ఊహించే విధంగా ఉండి కొత్తదనం లోపించినట్లు అనిపిస్తుంది. కానీ అనురాగ్ కశ్యప్ నుండి అతుల్ కులకర్ణి వరకు ఎవరూ చెప్పుకోదగ్గ ముద్ర వేయలేకపోయారు. అయితే ఈ సినిమా సాంకేతికంగా బలంగా ఉన్నప్పటికీ కథా కథనాల విషయంలో చాలా డల్ గా ఉంది. ‘హెల్ ఆఫ్ హై వాటర్’ అనే హాలీవుడ్ సినిమాలోని చాలా సీన్స్ ను వాడుకున్నారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అడివి శేష్ ఎప్పటిలాగే తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. కానీ శేష్ పలికిన రాయలసీమ యాస ఇబ్బంది పెడుతుంది. మృణాల్ ఠాకూర్ కు మంచి రోల్ పడింది. తన పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. శేష్ కంటే మృణాల్ దే కీలక పాత్ర. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ పర్వాలేదనిపించినా బలహీనమైన రైటింగ్ వల్ల అది పెద్దగా హైలైట్ కాలేదు. టెక్నికల్ గా ఈ సినిమాకు అతిపెద్ద బలం సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా రిచ్‌గా ఉన్నాయి. అయితే దర్శకుడు కథలోని ట్విస్టులపై పెట్టిన శ్రద్ధ వాటిని బలంగా పండించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మరీ అతిగా అనిపించి రియాలిటీకి దూరంగా ఉంది. ఒక్క మాటలో చెప్పలంటే ‘డెకాయిట్’ ఒక బిలో యావరేజ్ యాక్షన్ లవ్ స్టోరీ. శేష్ తన జోనర్ దాటి చేసి దొరికిపోయాడు, కమర్షియల్ సినిమాలు శేష్ చేయలేడెమోనని ఈ సినిమాలో శేష్ స్లాంగ్ చూస్తే అర్ధం అవుతుంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!