Chilakaluripet: చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో రద్దు అయిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పై కీలక ప్రకటన విడుదల చేశారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్.. చిలకలూరిపేట నియోజకవర్గంలో రద్దయిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను ఈ నెల 8, 9 తేదీల్లో జరిపేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.. 5వ తేదీ గణపవరం జడ్పీ పాఠశాలలో, ఎన్నికల్లో పాల్గొన్న పోస్టల్ బ్యాలెట్ ఓటర్లందరూ తిరిగి ఈనెల 8, 9 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.. అయితే, అధికారుల పొరపాటుతో పోస్టల్ బ్యాలెట్ లో రీపోలింగ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.. పోస్టల్ బ్యాలెట్ కు బదులు ఈవీఎం బ్యాలెట్ ను పొరపాటున ఇచ్చారని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం ఆర్‌వోకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్.
Read Also: Holiday: మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
కాగా, పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వల్ల 1219 మంది ఉద్యోగుల ఓట్లను ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. పోస్టల్ బ్యాలెట్ బదులు ఈవీఎంలకు వినియోగించే బ్యాలెట్‌లను వినియోగించారని ఎన్నికల పరిశీలకులు గుర్తించారు. మొత్తం పోలింగ్ పూర్తయిన తరువాత అధికారులు పొరపాటును గుర్తించారు. ఈ అంశంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. 1219 మంది ఉద్యోగులు ఓట్లు మురిగిపోతున్నాయని తెలిసి వెంటనే వాటిని లెక్కింపులోకి తీసుకోకుండా రీపోలింగ్ నిర్వహించాలని, సంబంధిత బాధ్యులపై చర్య తీసుకోవాలని ముఖేష్‌కుమార్ మీనా ఆదేశించిన విషయం విదితమే.