పురంధరేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అవ్వగానే సీఎం జగన్ ని తిట్టడం మొదలు పెట్టింది అని పోసాని కృష్ణ మురళి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వగానే ప్రెస్ మీట్ పెట్టి జగన్ ని తిట్టింది.. నేను స్కిల్ సెంటర్స్ కి వెళ్లి చూశానని.. బాబు బాగానే కంప్యూటర్స్ ఏర్పాటు చేశారని పురంధరేశ్వరి అన్నారు.. బాబు అరెస్ట్ అవ్వడానికి జగనే కారణమని.. అసలు బాబు తప్పేం లేదని పురంధరేశ్వరి అంటున్నారు.. మా బంధువు అవినీతి చేయలేదు.. అంతా వైసీపీ ప్రభుత్వమే చేసిందని పురంధరేశ్వరి అంటుంది..
చంద్రబాబు అవినీతి గురించి మీ నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీనే చెప్పాడు అంటూ పోసాని పురంధేశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: Nabha Natesh: శారీ పిక్స్ తో మనుసు దోచుకుంటున్న నభా నటేష్
చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్, కేడీ అని మోడీ అన్నారు.. బాలకృష్ణ తన రివాల్వర్ తో ఇద్దరిని కాల్చాడు.. బాలకృష్ణ బయపడి పురంధరేశ్వరి దగ్గరికి ఏడుస్తూ వచ్చాడు అంటూ పోసాని విమర్శించారు. పురంధరేశ్వరి వెంకటేశ్వర్ రావు ఇద్దరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరికి వచ్చారు.. మా తమ్ముడు ఇద్దరిని కాల్చాడు అన్నయ్య అని వైఎస్ కాళ్ల మీద పడింది అని ఆయన ఆరోపించారు. బాలకృష్ణని సెల్ లో పెట్టకుండా వైఎస్ కాపాడారు.. ఓ ఆడపిల్ల తన దగ్గర ఏడ్చింది కాబట్టి.. క్రిమినల్స్ ని కాపాడటం మీ మెంటాలిటీనా?.. ఎన్ని సార్లు, ఎన్ని పార్టీలు మారుతారు మేడం అంటూ పురంధేశ్వరిపై పోసాని కృష్ణ మురళి అడిగారు.
మీ నాన్న మద్యపానం నిషేధిస్తే.. చంద్రబాబు మళ్ళీ మద్యం ఏరులై పారించాడు అని పోసాని కృష్ణ మురళి తెలిపారు. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి చంపేశారు.. మీ ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిష్టర్ ఇస్తా అన్నాడు ఇవ్వలేదు.. కాంగ్రెస్ లో చేరారు.. రామారావు కూతురిని అని చెప్పుకున్నారు.. సోనియా గాంధీ సీట్ ఇచ్చారు.. కాంగ్రెస్ నుంచి ఓడిపోగానే బీజేపీలో చేరారు.. బీజేపీ ఓడిపోగానే మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్తారు.. ఓదార్పు యాత్రకు సోనియా అనుమతి ఇవ్వకపోతే పదవికి పార్టీకి రాజీనామా చేసాడు జగన్ అని పోసాని కృష్ణ మురళి అన్నారు. దేశంలో పాలిటిక్స్ ఉన్నంత కాలం వైఎస్ పేరు ఉంటుంది.. వైఎస్ ని లెజెండ్ పొలిటీషియన్ గా నిలబెట్టిన వ్యక్తి జగన్.. శవాల మీద పేలాలు మీరు ఏరుకుంటారు.. జగన్ ని ముట్టుకోకండి కాలిపోతారు అంటూ పోసాని కృష్ణ మురళి హెచ్చరించారు.