venky pooja: వెంకీ మూవీలో పూజా హెగ్డే..రూమర్స్‌కు ఫుల్ స్టాప్

Venkatesh Pooja Hegde

Venkatesh Pooja Hegde

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి అంటేనే బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యిందని నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. గతంలో ‘F3’ సినిమాలో పూజా ఒక స్పెషల్ సాంగ్ చేయడంతో, ఈసారి మెయిన్ హీరోయిన్‌గా ఆమెనే తీసుకున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఆమెతో కనీసం చర్చలు కూడా జరపలేదని, అవన్నీ కేవలం పుకార్లేనని తేల్చి చెప్పేసింది.

Also Read : Mahesh Babu: ఇండియాలో నా ఫేవరెట్ ఫుడ్ ఇదేనంటూ మహేష్ బాబు కామెంట్స్!

మరోవైపు, టాలీవుడ్‌లో సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న పూజా హెగ్డేకు ఒక బంపర్ ఆఫర్ తగిలిందని సమాచారం. వరుస హిట్లతో దూసుకుపోతున్న మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సరసన ఆమె ఛాన్స్ కొట్టేసిందట. ఒక పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో దుల్కర్ హీరోగా నటిస్తుండగా, అందులో పూజా హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు కథా పరంగా చాలా ప్రాధాన్యత ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ప్రస్తుతం పూజా హెగ్డే తన కెరీర్‌ను మళ్ళీ ట్రాక్‌లో పెట్టేందుకు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. వెంకటేష్ సినిమా రూమర్స్‌కు ఎండ్ కార్డ్ పడినా, దుల్కర్ సల్మాన్ వంటి క్రేజీ హీరో పక్కన ఛాన్స్ రావడంతో ఆమె ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రొమాంటిక్ డ్రామా పూజాకి తెలుగులో పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి!