ఖమ్మం బీజేపీ జిల్లా కార్యాలంయంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్టంలో అకాల వర్షాల వల్ల రైతాంగం నష్టపోయిందన్నారు. రైతాంగాన్ని ఆదుకొని,ఎకరాకు నష్ట పరిహారం 50వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులకు బేడి లేసిన కేసీఆర్ ప్రభుత్వం మహారాష్ట్రలో రైతు ప్రభుత్వం తెస్తాడట అంటూ ఆయన సెటైర్లు వేశారు. కేటీఆర్ ప్రధాన మంత్రి, పార్టీ సంగతి తెలుస్తా అంటున్నాడని, అక్రమ వ్యాపారంలో బీఆర్‌ఎస్ నాయకులు బిజీగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Yogi Adityanath: మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకం.. కాంగ్రెస్‌పై యోగి అటాక్..
బంగారు తెలంగాణ అని చిలక పలుకులు పలుకుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. సీపీఎం, సీపీఐ రెండు పార్టీలు కేసుల నుండి ఒకరు సీటు కోసం ఒకరు కేసీఆర్ కి లొంగిపోయారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తన ఉనికి కోల్పోయిందని, బీజేపీలోకి ఎవరు వచ్చిన స్వాగతిస్తామన్నారు. కేసీఆర్ నిరుద్యోగులతో ఆటలాడుతున్నాడని, ఈ నెల 30 తేదీన ప్రధాన మంత్రి మన్ కీ బాత్ 100ఎపిసోడ్ ప్రతి సెంటర్ లో జరుగుతుందని, కేసీఆర్ కి ప్రజలే బుద్ది చెబుతారన్నారు.
Also Read : Boora Narsaiah Goud : అధికారం అన్ని రోజులు మీకే ఉండదు