NTV Telugu Site icon

Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ కమిటీని సర్వేయర్లును భాగస్వామి చేసుకోవాలి

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy : ప్రజాపాలనలో అప్లై చేసి కొని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లలో అప్లై చేసేకునే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో 10 కొత్త అంశాలు చేర్చాము. సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామని, ఇప్పటి వరకు 2లక్షల 32 వేల దరఖాస్తులను యాప్ లో నమోదు చేశామన్నారు. ఆలస్యం అయిన అసలైన లబ్ధి దారులకు ఇల్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐటీడీఏ, ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి…. ప్రత్యేక నిధులు కేటాయింపు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి. ఇందిరమ్మ కమిటీని సర్వేయర్లును భాగస్వామి చేసుకోవాలని, సంక్రాంతి లోపల vro వ్యవస్థ ను తీసుకొని వస్తాము. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి వెనక్కి వచ్చే వాళ్ళను తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి. తప్పు చేసిన అధికారులను కఠిన చర్యలు ఉంటాయని, ఈ అసెంబ్లీ లో ror చట్టం అమలు చేస్తాం…ror చట్టం వచ్చిన మేడ్చల్ రంగారెడ్డి అక్రమార్కుల చిట్టాను ఆధారాలతో బయట పెడుతామన్నారు. 1971లో ఉన్న మంచిని తీసుకుంటామన్నారు.

Skoda Kylaq: బుకింగ్స్‌లో దూసుకుపోతున్న ‘‘కైలాక్’’.. బ్రెజ్జా, నెక్సాన్, వెన్యూ, సోనెట్‌లో కలవరం..

ప్రధాన ప్రతి పక్ష నాయకుడిగా కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి.. నేను వస్తారు అనుకుంటున్నా అని ఆయన అన్నారు. Ror చట్టం తెస్తున్నాము. సూచనలు చేయాలి అని కోరుకుంటున్నామన్నారు. 80 వేల పుస్తకాలు నేను, మా ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు చదవలేదని, 80వేల పుస్తకాలు చదివినా ఆయన అనుభవం ఉన్న కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి అని కోరుకుంటున్నా అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ ,హరీష్ రావు కనీసం 5వేల పుస్తకాలు చదివినా వాళ్ళ సూచనలు తీసుకునే వాళ్ళం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సూచనలు చేశారా.. తెలంగాణ తల్లి విగ్రహం పై గోల చేస్తున్నారు అధికారిక ప్రకటన ఎప్పుడైనా వారు.. ధర్నా చౌక్ నీ ఓపెన్ చేశాం…ఎవరిని మేము అడ్డుకోము.. రైతులకు భేడీలు వేయడం సరి అయింది కాదు.. ఇప్పటికే మా ముఖ్యమంత్రి ఈ ఘటన పై స్పందించారు.. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కి కారణం.. అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహం పై సమాధానం లేకనే అసెంబ్లీ కి రాకుండా పారి పోయారు.. అదానీ విషయంలో వివాదం వొద్దు అనే స్కిల్ యూనివర్శిటీ కి ఇచ్చిన 100కోట్లు వెనక్కి పంపాము.. ఈ డిసెంబర్ 31 లోపు మంత్రి వర్గ విస్తరణ వుంటుంది.. 40% డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో 14 వ తారీఖు అందరూ మంత్రులు,అధికారులు భోజనం చేయాలి.. 2 సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్న బిల్లులు 31 లోపు హాస్టల్ లకు పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేస్తాము.. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడలేదు.. తెలంగాణ తల్లి బయ్యారం ఉక్కు కర్మాగారం అంటూ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటున్నారు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

Naga Chaitanya : పెళ్లయిన వెంటనే ముంబైకి నాగచైతన్య, శోభిత

Show comments