Naga Chaitanya : పెళ్లయిన వెంటనే ముంబైకి నాగచైతన్య, శోభిత
- అనురాగ్ కశ్యప్ కూతురి పెళ్లిలో సో చై సందడి
- సంప్రదాయ దుస్తుల్లో ఫోటోలకు ఫోజులిచ్చిన కొత్త జంట
- త్వరలో తండేల్ తో రాబోతున్న నాగ చైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya : నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట పెళ్లి వేడుక తెలుగు సాంప్రదాయం ప్రకారం కనులపండువగా సాగింది. ఈ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కొద్దిమంది బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. చైతు శోభిత పెళ్లిలో కంజీవరం పట్టు చీరలో శోభిత చాలా అందంగా కనిపించింది, నాగ చైతన్య తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. డిసెంబర్ 6 ఉదయం ఏపీలోని శ్రీశైలం ఆలయంలో ఆశీర్వాదం తీసుకుంది ఈ నూతన జంట. కొత్త జంట మొదటిసారి శివాలయంలో భక్తి పారవశ్యంలో కనిపించారు. పెళ్లయి ఇంకా వారం అయినా కాలేదు. ఇంతలోనే ఈ జంట ముంబైకి వెళ్లింది. బాలీవుడ్ టాప్ డైరక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ పెళ్లిలో సందడిగా కనిపించారు. తన దీర్ఘకాల భాగస్వామి షేన్ గ్రెగోయిర్‌ను ఆలియా కశ్యప్ ముంబైలో అందమైన సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి అందాల హీరోయిన్లు సహా పలువురు టాప్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. టాలీవుడ్ నుంచి శోభిత- నాగచైతన్య జంట విశేష అతిథులుగా సందడి చేశారు. ఈవెంట్ లో చై అందంగా స్మైలిస్తూ సూట్ లో ఇస్మార్ట్ గా కనిపించగా, శోభిత ట్రెడిషనల్ పంజాబీ డ్రస్ లో ఎంతో ముచ్చటగా కనిపించింది. సో చై జంట ఫోటోగ్రాఫర్లను ఫోజులిచ్చారు.
Read Also:Mangampet Incident: ఓ తండ్రి తీర్పు.. మంగంపేట హత్య కేసులో మరో ట్విస్ట్
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ఆలియా – షేన్ గతేడాది ముంబైలో ఒక ప్రైవేట్ వేడుకలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. మే 2023లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు. కెరీర్ విషయానికి వస్తే శోభిత చివరిసారిగా లవ్ సితారలో నటించారు. చైతన్య త్వరలో `తండేల్`తో థియేటర్లో సందడి చేశారు. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తండేల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఆలియా కశ్యప్ పెళ్లికి సో చై జంటకు ఆహ్వానం ఎలా అందింది? అంటే.. శోభితకు ఉన్న సంబంధాలే కారణమని తెలుస్తోంది. అనురాగ్ తన 2016 క్రైమ్ థ్రిల్లర్ రామన్ రాఘవ్ 2.0తో శోభితకు పెద్ద బ్రేక్ ఇచ్చాడు. తరువాత నెట్‌ఫ్లిక్స్ ఇండియా 2020 హారర్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో అనురాగ్ సెగ్మెంట్ లో ఆమె నటించింది. అనురాగ్ సహ నిర్మాతగా వ్యవహరించిన గీతూ మోహన్‌దాస్ 2019 మలయాళ యాక్షన్ థ్రిల్లర్ `మూథోన్`లో కూడా శోభిత హీరోయిన్ గా నటించింది. హిందీ చిత్ర సీమలో శోభిత మనుగడకు అనురాగ్ కీలక సహకారం అందించారు. అలా అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ కి శోభిత సన్నిహితురాలైంది.
Read Also:Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?