Skoda Kylaq: స్కోడా కొత్త ఎస్‌యూవీ ‘‘కైలాక్’’ బుకింగ్స్‌లో దూసుకుపోతోంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా స్కోడా కైలాక్ రాబోతోంది. స్కోడాలో ఇప్పటి వరకు సెడాన్, ఎస్‌యూవీ కార్ వంటి కార్లు ఉన్నప్పటికీ, సబ్-4 మీటర్ ఎస్‌యూవీ లేకపోవడంతో, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు కైలాక్‌ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ఇండియాన్ మార్కెట్‌లో ఈ విభాగంలో తీవ్ర పోటీ నెలకొని ఉంది. మారుతీ సుజుకీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటివి కైలాక్‌కి ప్రత్యర్థిగా ఉన్నాయి.
కైలాక్ తొలి 10 రోజుల్లో 10,000 కంటే ఎక్కువ బుకింగ్స్‌ని సంపాదించి సత్తా చాటింది. స్కోడా కైలాక్ డిసెంబర్ 2 నుంచి బుకింగ్స్ ప్రారంభించింది. జనవరి 27 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ చెప్పింది. కార్ మేకర్ ఇప్పటికే మొదటి 33,333 కస్టమర్లకు పరిమిత ఆఫర్‌ని ప్రకటించింది. వీరు కాంప్లిమెంటరీ 3 ఇయర్స్ స్టాండర్స్ మెయింటెనెన్స్ ప్యాకేజీని పొందనున్నారు. దీని వల్ల మొదటి 33,333 కస్టమర్లు ఐదు ఏళ్లకు కి.మీకి రూ. 0.24 నిర్వహణ ఖర్చును మాత్రమే కలిగి ఉంటారు.
కస్టమర్లతో కనెక్ట్ కావడానికి స్కోడా కైలాక్ భారత్ వ్యాప్తంగా ‘డ్రీమ్ టూర్’ ప్రారంభించింది. డిసెంబర్ 13న చకాన్ ప్లాంట్ నుంచి మూడు కైలాక్ ఎస్‌యూవీ కార్లు 43 రోజుల పాటు 70 నగరాల రూట్లను చుట్టేస్తాయి. జనవరి 25న తిరిగి ప్లాంట్‌కి వస్తాయి. పశ్చిమ-దక్షిణ మార్గంలో పూణే, కొల్హాపూర్, పనాజీ, మంగళూరు, మైసూరు, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలు ఉంటాయి. పశ్చిమ-ఉత్తర మార్గంలో ముంబై, సూరత్, వడోదర, అహ్మదాబాద్, ఢిల్లీ వంటి నగరాలు ఉంటాయి, మూడవ మార్గం పూణే నుండి తూర్పు వైపు నాసిక్, నాగ్‌పూర్, కోల్‌కతా వంటి నగరాలను కవర్ చేస్తుంది.
Read Also: Manchu Family Controversy : మీడియాకు మోహన్ బాబు ఆడియో సందేశం
ఇంజన్, ధరల వివరాలు:
కైలాక్ 1.0 లీటర్ టీఎస్ఐ ఇంజన్ కలిగి ఉంది. ఇది 115 bhp , 178Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యానువల్, 6-స్పీడ్ ఆటోమెటిక్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్‌మిషన్లను కలిగి ఉంది. కైలాక్ గరిష్టంగా 188kmph వేగాన్ని అందుకోగలదని మరియు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 10.5 సెకన్లలో 0-100kmph నుండి వేగాన్ని అందుకోగలదని స్కోడా పేర్కొంది.
నాలుగు వేరియంట్లను కలిగి ఉంది. క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్, ప్రెస్జీజ్ వేరియంట్ ఉన్నాయి. ధరల వివరాలను(ఎక్స్ షోరూం) పరిశీలిస్తే..
క్లాసిక్ MT – రూ. 7.89 లక్షలు
సంతకం MT – రూ. 9.59 లక్షలు
సంతకం AT – రూ. 10.59 లక్షలు
సంతకం+ MT – రూ. 11.40 లక్షలు
సంతకం+ AT – రూ. 12.40 లక్షలు
ప్రెస్టీజ్ MT – రూ. 13.35 లక్షలు
ప్రెస్టీజ్ ఏటీ – రూ. 14.40 లక్షలు