Marco rubio: పాకిస్తాన్ కష్టం.. ఇండియాకి ఇష్టం.. ట్రంప్ కీలక ఎంపిక..
- ట్రంప్ ఎంపికతో పాకిస్తాన్‌లో భయం..
- విదేశాంగ మంత్రి మార్కో రుబియోకి హడలి చస్తున్న పాక్..
- భారత్‌కి అత్యంత సన్నిహితుడిగా మార్కో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marco rubio: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత, ఆయన కేబినెట్ కూర్పుపై దృష్టిపెట్టారు. తాజాగా భారత్‌కి గట్టి మద్దతుదారు అయిన మైక్ వాల్ట్జ్‌ని జాతీయభద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా నియమించారు. ఇదే విధంగా మరో వ్యక్తి, భారత్‌తో సన్నిహితంగా ఉంటే మార్కో రుబియోని అత్యంత కీలమైన ‘‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’’గా నిమించారు. అయితే, ఈ నియామకాలు ఇండియాకు చాలా కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు.
Read Also: Death: మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది..? నర్స్ చెప్పిన విషయాలు వైరల్..
Also Read
- Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ప్రస్తుతం ట్రంప్ ఎంపిక చేసుకున్న ఇద్దరు వ్యక్తులను చూసి పాకిస్తాన్ వణుకుతోంది. ఇద్దరూ కూడా పాకిస్తాన్ అంటేనే కఠినంగా వ్యవహరించే స్వభావం కలిగిన వారు. భారత్‌తో దోస్తీకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు. ముఖ్యంగా అమెరికా కొత్త సెక్రటరీ ఆఫ్ స్టేట్(విదేశాంగ మంత్రి)గా మార్కో రుబియోని నియమించడంతో పాక్ ప్రభుత్వం, పాకిస్తానీలు ఆందోళన చెందుతున్నారు. పాకిస్తాన్ రాజకీయ వ్యాఖ్యాత కమర్ చీమా మాట్లాడుతూ.. రాబోయే కాలం పాకిస్తాన్‌కి ఇబ్బంది కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు.
మార్కో చాలా స్పష్టంగా భారత్ అనుకూల, పాకిస్తాన్ వ్యతిరేక వ్యక్తి అని చీమా పేర్కొన్నారు. దీంతో రాబోయే కాలంలో అమెరికాలో భారత ప్రాభవం పెరిగి, పాకిస్తాన్ స్థానం బలహీన పడుతుందని చెప్పారు. మార్కో పాకిస్తాన్‌కే కాకుండా, చైనాకు కూడా వ్యతిరేకి అని అన్నారు. హమాస్, గాజాపై దూకుడుగా వ్యవహరిస్తారని, ఇజ్రాయిల్‌కి బేషరతుగా మద్దతు ఇస్తారని, అతడి వైఖరి పాకిస్తాన్‌కి ఇబ్బందిగా మారుతుందని చెప్పారు. ఎన్ఎస్ఏ మైక్ వాల్ట్జ్ కూడా పాకిస్తాన్ వ్యతిరేకే అని చీమా అన్నారు. ట్రంప్ పాలనా వైఖరిని బట్టి పాకిస్తాన్ సౌదీ అరేబియా వైపు వెళ్లడం మాత్రమే ఒక్క ఆప్షన్ అని అన్నారు.
తాజావార్తలు
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?