Karnataka Minister: రాజకీయ నాయకులు అవినీతిపరులు కాదు.. వ్యవస్థ వారిని అలా చేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Minister: నేటి కాలంలో అవినీతి రహిత జీవితాన్ని గడపడం చాలా కష్టమైన పని అని… ఎందుకంటే రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడాలని డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక న్యాయ, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మధుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు అవినీతిపరులు కాదని, ప్రజలు, వ్యవస్థ వారిని అలా చేస్తాయని ఆయన అన్నారు. శనివారం శివకుమార శివాచార్య స్వామివారి వర్ధంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. “రాజకీయ నాయకులను అవినీతిపరులు అని పిలవను, ప్రజలే వారిని తయారు చేశారు, ఓట్లు వేయడం మొదలు గణేష్ ఉత్సవాల వరకు వివిధ కార్యక్రమాల పేరుతో రాజకీయ నాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడకుండా ఎలా ఉంటారు.” అని మంత్రి అన్నారు.
Maa Robot: దివ్యాంగులైన కుమార్తె కోసం దినసరి కూలీ సరికొత్త ఆవిష్కరణ
Also Read
- OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
- Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- OTR: 'నో పాలిటిక్స్... ఓన్లీ రూల్స్'.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
- Ravi Bishnoi: రవి బిష్ణోయ్‌లో అంత చేంజ్ ఎలా వచ్చింది.. ఆ ఒక్క మార్పుతో ఫామ్‌లోకి వచ్చిన లెగ్ స్పిన్నర్..
ప్రజలు ప్రతిదానికీ డబ్బు తీసుకుంటారని గతంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగాన్ని కూడా పలువురు అడ్డుకున్నారు. వాతావరణమే రాజకీయ నాయకులను అవినీతిపరులుగా మారుస్తుందన్న ఓ దర్శకుడి మాటతో తాను ఏకీభవిస్తున్నానని జేసీ మధుస్వామి అన్నారు. “వ్యవస్థ మనల్ని చెడగొడుతోంది, అది మనల్ని పాడు చేయకపోతే, మనం అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు, రాజకీయ నాయకులందరికీ తమకు కావాల్సినంత డబ్బు ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బు ఎక్కడ సంపాదించాలి అనే ఆలోచనలు రావడం సహజం. అలాంటి పరిస్థితి తలెత్తకపోతే అప్పుడు వ్యవస్థ చెడిపోదు. అవినీతికి మూలం ఆలోచన. ఒత్తిడే అవినీతికి కారణం కావచ్చు. అవినీతి లేకుండా జీవించగలను అని చెప్పడం అంత తేలిక కాదు.”అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
OTR: ‘నో పాలిటిక్స్… ఓన్లీ రూల్స్’.. నిబంధనలకే ప్రాధాన్యం అంటున్న అటవీశాఖ ఉన్నతాధికారి..
-
Story Board : రాజధానిని రగిలించారు.. చట్టసభల్ని స్తంభింపజేశారు
-
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్‌తో రూమర్స్‌పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!