Sharvari Wagh: ‘ముంజ్యా’ తర్వాత ఒక్క హిట్ లేదు.. శార్వరి ఆశలన్నీ ఆ సినిమాపైనే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharvari Wagh Latest News: బాలీవుడ్ యువ హీరోయిన్ శార్వరి వాగ్ ప్రస్తుతం కెరీర్లో ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. ‘బంటీ ఔర్ బబ్లీ 2’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ భామ.. ‘ముంజ్యా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో వరుసగా ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు అందుకుంది. అయితే ఆ విజయాన్ని కొనసాగించడంలో మాత్రం తడబడుతోంది. ముంజ్యా తర్వాత శార్వరి ఖాతాలో మరో భారీ హిట్ పడలేదు.
శార్వరి నటించిన ‘వేద’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ ఏడాది విడుదలైన ‘మై వాపస్ ఆవూంగా’ కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అలియా భట్ నటించగా.. శార్వరి కూడా తన నటన, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అలియాకు గట్టి పోటీ ఇచ్చేలా తన పాత్రలో రాణించినప్పటికీ.. సినిమా ఫలితం ఆమెకు ఆశించిన గుర్తింపును తీసుకురాలేకపోయింది. వరుస పరాజయాలతో వెనకపడిపోయిన శార్వరి.. ‘యే ప్రేమ్ మోల్ లియా’ సినిమాపై ఆశలు పెట్టుకుంది.
Also Read
బాలీవుడ్లో ఫీల్‌గుడ్ ప్రేమకథలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూరజ్ బర్జాత్యా.. యే ప్రేమ్ మోల్ లియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా శార్వరి నటిస్తోంది. ప్రముఖ రాజశ్రీ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత దర్శకుడు సూరజ్ బర్జాత్యా, సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా కలిసి పనిచేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై బాలీవుడ్లో ఆసక్తి నెలకొంది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న ‘బేపర్వా’ కూడా శార్వరి కెరీర్‌కు కీలకంగా మారనుంది. యే ప్రేమ్ మోల్ లియాతో శార్వరి మళ్లీ విజయాల బాట పడుతుందా? లేదా వచ్చే ఏడాది వచ్చే బేపర్వా కోసం ఎదురుచూడాల్సి వస్తుందా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Sharvari Wagh: ‘ముంజ్యా’ తర్వాత ఒక్క హిట్ లేదు.. శార్వరి ఆశలన్నీ ఆ సినిమాపైనే!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
-
UP Farmers Relief: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన యోగి సర్కార్.. అన్నదాతకు భారీ ఊరట
-
IND vs NZ: రెండో వన్డే మ్యాచ్ రద్దు కానుందా..?
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!