Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shadman Islam: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ షాద్మన్ ఇస్లాం చీలమండ గాయంతో మైదానంలోనే కుప్పకూలాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడిని వైద్య సిబ్బంది స్ట్రెచర్‌పై మైదానం వెలుపలకు తీసుకెళ్లారు. సిల్హెట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ రెండో రోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 78వ ఓవర్లో మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో అమీర్ జాంగూ బంతిని ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షాద్మన్ బంతిని ఆపేందుకు పరుగెత్తాడు. అయితే బంతిని అందుకునే ప్రయత్నంలో జారి కిందపడ్డాడు. ఈ క్రమంలో అతడి ఎడమ చీలమండకు గాయమైంది. రీప్లేల్లో ఔట్‌ఫీల్డ్‌లో మంచు ఉండటంతోనే అతడు జారిపడినట్లు కనిపించింది.
షాద్మన్ గాయంపై బంగ్లాదేశ్ ఫిజియో బాయ్జెదుల్ ఇస్లాం ఖాన్ స్పందించాడు. అతడి ఎడమ చీలమండ మెలిక పడిందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపాడు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కాన్ చేయించనున్నట్లు వెల్లడించాడు. తొలి టెస్టులో సెంచరీ సాధించిన షాద్మన్ ఈ మ్యాచ్‌లో మళ్లీ బ్యాటింగ్‌కు వస్తాడా..? లేదా.? అన్నది ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ అతడు మ్యాచ్‌కు దూరమైతే, మిగిలిన ఆటను బంగ్లాదేశ్ పది మంది ఆటగాళ్లతోనే కొనసాగించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ తొలి రోజు వెస్టిండీస్ 70 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. వెలుతురు సరిగా లేకపోవడంతో ఆటను నిర్ణీత సమయానికి ముందుగానే నిలిపివేశారు. రెండో రోజు ఆట ప్రారంభంలోనే షాద్మన్ గాయపడటం బంగ్లాదేశ్ శిబిరంలో ఆందోళన కలిగించింది. ప్రస్తుతం వెస్టిండీస్ 322/8 పరుగులతో బ్యాటింగ్ చేస్తుంది.
Also Read
- IND vs NZ: రెండో వన్డే మ్యాచ్ రద్దు కానుందా..?
- Gollabuddharam Murder: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!
- NPS Tatkal Scheme: తక్కువ ఆదాయం ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.10తోనే పెన్షన్ పొదుపు!
- Telangana Govt: ప్రయాణికులకు 'దీపావళి' కానుక.. రూ.8,500 పాస్ ఇక రూ.4,000కే!
తాజావార్తలు
-
Shadman Islam: బంగ్లాదేశ్‌కు భారీ షాక్.. గాయంతో స్ట్రెచర్‌పై మైదానం వీడిన ఓపెనర్..!
-
IND vs NZ: రెండో వన్డే మ్యాచ్ రద్దు కానుందా..?
-
Gollabuddharam Murder: ప్రియుడి మోజులో పడి భర్తను హతమార్చిన భార్య.. మృతదేహాన్ని ఎడ్లబండిపై తరలించి..!
-
NPS Tatkal Scheme: తక్కువ ఆదాయం ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.10తోనే పెన్షన్ పొదుపు!
-
Telangana Govt: ప్రయాణికులకు ‘దీపావళి’ కానుక.. రూ.8,500 పాస్ ఇక రూ.4,000కే!
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!