ఏపీలో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టికెట్ల రచ్చ మొదలైంది. బెజవాడ వెస్ట్ టికెట్ బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉండటంతో ఆందోళనకు దిగింది జనసేన. పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వాలనీ ఆందోళనకు దిగింది మహేష్ వర్గం. మైలవరం టికెట్ టీడీపీ నేత బొమ్మసాని సుబ్బా రావుకి ఇవ్వాలని ఆయన వర్గం గొల్లపూడిలో ఆందోళన చేపట్టారు. టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెట్టే ఆలోచనలో పెనమలూరు టీడీపీ ఇంఛార్జి బోడె ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. బోడె కి టికెట్ లేదని ఇప్పటికే చెప్పేసింది టీడీపీ అధిష్టానం. అయితే.. పోతిన మహేష్ నివాసం దగ్గర మహేష్ వర్గం ఆందోళన దిగారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని స్వయంగా ప్రకటించారని, పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగి నానా బీభత్సం సృష్టించారన్నారు. ఇంత జరుగుతున్నా టీడీపీ లో కీలక నేతలు ఎవరూ రెస్పాండ్ అవలేదని, పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పార్టీలు స్పందించాల్సి ఉందన్నారు మహేష్.
MLA Mahipal Reddy: తప్పు చేస్తే ఫెనాల్టీ వేయండి.. కన్నీరు పెట్టుకున్న మహిపాల్ రెడ్డి..
అంతేకాకుండా.. జనసేన అధినేత పవన్ కోసం జనసైనికులు స్పందించాలని, పార్టీ అధ్యక్షుడి కే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన నుంచి కూడా రాష్ట్ర నాయకత్వం స్పందించాలని, అలా ఎందుకు చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. జనసేన రాష్ట్ర నాయకత్వం కూడా బయటకు వచ్చి చర్యలు చేపట్టాలని, గతంలో కూడా పవన్ ఓటమి పాలయ్యారు కాబట్టి జాగ్రత్త చర్యలు ఇప్పుడు అవసరమన్నారు. బెజవాడ పశ్చిమ సీటును జనసేన కు ఇవ్వాలని, గత 8 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానన్నారు. వైసీపీ పాలనలో కేసులు పెట్టించుకున్నామని, జనసేన బలంగా ఉండబట్టే వైసీపీ సిట్టింగ్ అభ్యర్దిని మార్చేసిందన్నారు. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును జనసేనకు కేటాయించాలని, పవన్ పై పూర్తి నమ్మకం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంక్ జనసేనకు వచ్చిందని, గత ఐదేళ్లుగా నాతో పాటు పార్టీ నేతలు డబ్బు, సమయం రెండు కేటాయించామని ఆయన అన్నారు.