ఏపీలో టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టికెట్ల రచ్చ మొదలైంది. బెజవాడ వెస్ట్ టికెట్ బీజేపీకి వెళ్ళే అవకాశాలు ఉండటంతో ఆందోళనకు దిగింది జనసేన. పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వాలనీ ఆందోళనకు దిగింది మహేష్ వర్గం. మైలవరం టికెట్ టీడీపీ నేత బొమ్మసాని సుబ్బా రావుకి ఇవ్వాలని ఆయన వర్గం గొల్లపూడిలో ఆందోళన చేపట్టారు. టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెట్టే ఆలోచనలో పెనమలూరు టీడీపీ ఇంఛార్జి బోడె ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. బోడె కి…