తెలుగు రాష్ట్రాల్లో మీర్‌పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు సంచలన విషయాలు మీడియాకు తెలిపారు.
Meerpet Murder Case: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా.. దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు చెబుతుంటే.. పోలీసులే షాక్ అవుతున్నారు.